ఐదారేళ్ళ క్రితం తెలుగు చిత్రపరిశ్రమలో హారర్ కామెడీలు, థ్రిల్లర్ సినిమాలు రాజ్యమేలిన రోజుల్లో `ప్రేమకథా చిత్రమ్`తో హీరోయిన్ నందిత, ‘గీతాంజలి’తో దర్శకుడు రాజకిరణ్ పేరు తెచ్చుకున్నారు. వీరిద్దరూ కలిసి చేసిన చిత్రం `విశ్వామిత్ర`. అమెరికా, న్యూజీలాండ్ దేశాల్లో జరిగిన యథార్థ ఘటనల ఆధారంగా తెరకెక్కిన థ్రిల్లర్ ఇది. సత్యం రాజేష్, అశుతోష్ రాణా, ప్రసన్నకుమార్ ఇంపార్టెంట్ రోల్స్ చేశారు. మార్చి 21న చిత్రాన్ని విడుదల చేయాలని నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. నందితతో పాటు `విశ్వామిత్ర` విజయం దర్శకుడు రాజకిరణ్కి ఇంపార్టెంటే. `గీతాంజలి`, `త్రిపుర` చిత్రాల తరవాత పంథా మార్చి `లక్కున్నోడు ` అని మంచు విష్ణుతో చేసిన చిత్రం రాజకిరణ్కి విజయాన్నివ్వలేదు. అందువల్ల, ఆయనకూ ఈ చిత్రవిజయం కీలకమే. అందుకని, మళ్లీ తన థ్రిల్లర్ పంథాలోకి వచ్చి `విశ్వామిత్ర` తీశారు. ఈ చిత్రంతో తనకు తప్పకుండా హిట్ వస్తుందని నందిత నమ్మకంగా వుంది. వచ్చే వారంలో 21వ తేదీన ట్రైలర్ విడుదల చేయనున్నారు. నందితకు, రాజకిరణ్కు విజయాలు అందించిన జానర్లో వస్తున్న కావడంతో దీనిపై ప్రేక్షకుల్లో పాజిటివ్ బజ్ వస్తోంది. ఈ చిత్రానికి 21-21 సెంటిమెంట్ ఎంటో? ఈ నెల 21న ట్రైలర్… వచ్చే నెల 21న సినిమా విడుదల చేస్తున్నారు.