https://www.youtube.com/watch?v=KypNI5ug4vk&feature=youtu.be
కల్యాణ్ రామ్ ఎప్పుడూ వైవిధ్యభరితమైన కథలకు పెద్ద పీట వేసేవాడు. అందుకే తననుంచి అతనొక్కడే, హరే రామ్ లాంటి కొత్త తరహా కథలొచ్చాయి. అయితే ఆ తరవాత తను కూడా మెల్లగా కమర్షియల్ దారి వెతుక్కున్నాడు. వాణిజ్య విలువలవైపు దృష్టి పెట్టాడు. తాను కూడా రొటీన్ దారిలోనే వెళ్లిపోతున్నాడు అనుకునేలోగా ఓ థ్రిల్లర్ కథాంశాన్ని ఎంచుకున్నాడు. అదే `118`. గుహన్ దర్శకత్వం వహించిన చిత్రమిది. కలలోకొచ్చిన అమ్మాయి కోసం… కథానాయకుడు చేసిన అన్వేషణ ఇది. అసలు ఆమె ఉందా, లేదా? ఉంటే ఎక్కడ ఉంది? అంటూ ఆచూకీ తెలుసుకునే క్రమంలో కథానాయకుడికి ఎదురైన అనుభవాల్ని చూపించారు. “మొదలెట్టింది ఏదైనా మధ్యలోనే ఆపేయాలంటే నాకు చిన్నప్పటి నుంచీ చెడ్డ చికాకు… వెధవ క్యూరియాసిటీ“ అనే డైలాగ్ ఉంది ఈ సినిమాలో. అలాంటి క్యూరియాసిటీనే ఈ టీజర్ కూడా పెంచేసింది. అటు యాక్షన్, ఇటు రొమాన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ అన్నీ సమపాళ్లలో ఉండేలా చూసుకున్నారు. షాలినీ పాండే, నివేథా థామస్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రం మార్చి 1న విడుదల అవుతోంది.