విక్రమ్ కుమార్ డైరక్షన్ లో నాని చేస్తున్న సినిమా గ్యాంగ్ లీడర్. ఈ సినిమా కథ అల్లు అర్జున్ క్యాంప్ నుంచి నాని వైపు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ కథ సెకండాప్ మీద ఎంతకూ శాటిస్ ఫై కాలేక వదిలేసాడు బన్నీ. మరి అలాంటి కథను నాని ఎలా ఒకె అన్నాడు? ఏమిటి స్ట్రాటజీ?
విక్రమ్ కుమార్ తెచ్చిన కథకు బోలేడు రిపేర్లు చేసారట. నాని పర్సనల్ గా ఓ రైటర్ ను సాయిం పెట్టాడట. అలాగే డార్లింగ్ స్వామి (రైటర్, డైరక్టర్) ఓ వెర్షన్ రాసాడట. మరో ఇద్దరు ముగ్గురు వాళ్ల వెర్షన్లు వాళ్లు రాసారట. వీటన్నింటి లోంచి మంచివి అన్నీ ఏరి ఆఖరికి స్క్రిప్ట్ సెట్ చేసారని తెలుస్తోంది.
ఆ విధంగా విక్రమ్ కుమార్ కు ముగ్గురు నలుగురు రైటర్లు సాయంపట్టారని టాక్ వినిపిస్తోంది. మరి బన్నీ క్యాంప్ లో ఇన్ని రిపేర్లు ఎందకు సాధ్యం కాలేదు అన్నది అనుమానం. పైగా అక్కడ కథలు వండడంలో సిద్దహస్తుడైన వక్కంతం వంశీని తోడు పెట్టారు. అయినా అక్కడ సెట్ కాలేదు.
మరి ఇక్కడ ముగ్గురు నలుగురు బడ్డీ రైటర్లు కలిసి ఎలా సెట్ చేసారొ? నాని ఎలా ఓకె అన్నాడో, సినిమా చూస్తే కానీ తెలియదు.