ఎన్నికల వ్యూహాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. ఓ వైపు కులం గొడవలు పెట్టేందుకు ప్రయత్నించడమే కాదు.. ఇతర పార్టీలపై.. ఫ్యాక్షనిజం తరహా ఆలోచలనతో.. మైండ్ గేమ్ ఆడటం.. వ్యక్తిత్వ హననానికి పాల్పడటం వంటి వ్యవహారాలకు పదును పెడుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను ఎక్కువగా గురి పెట్టారు. ఆయనను .. మానసికంగా బలహీనం చేసేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనో… అన్నీ.. తీసుకుంటున్నారు.
మొదట వ్యక్తిగత విమర్శలతో ప్రారంభం…!
“పవన్ కల్యాణ్ కార్లను మార్చినట్లు పెళ్లాలను మారుస్తాడు. నిత్యపెళ్లికొడుకు. ఇంకొకరైతే బొక్కలో వేసి చితక్కొట్టి ఉండేవాళ్లు..”… ఇదీ పవన్ కల్యాణ్‌పై నేరుగా జగన్ చేసిన వ్యాఖ్య. ఇందులో రాజకీయం ఉందా..? లేనే లేదు.. మొత్తం వ్యక్తిగతమే ఉంది. అంటే.. పవన్ కల్యాణ్‌ను రాజకీయంగా అంటే.. ఆయన లైట్ తీసుకుంటారేమోనన్న ఉద్దేశంతో… నేరుగా వ్యక్తిగతంగా… జగన్ టార్గెట్ చేశారు. దీనికి కారణం .. వైసీపీ వర్గాలు చెబుతూ ఉంటాయి. పవన్ కల్యాణ్.. ఓ రకంగా సున్నిత మనస్కుడు.. ఇలా..జగన్ అంటే.. ఆయన కంట్రోల్ తప్పిపోతారు. ఆ తర్వాత… జనసేనను ఎంత డ్యామేజ్ చేయాలో.. అంతా చేయవచ్చు అనేదే వ్యూహం. అది ప్రారంభోత్సవం మాత్రమే.. అప్పట్నుంచి… ఈ తరహా మైండ్‌గేమ్.. ఉద్ధృతంగా సాగుతూనే ఉంది.
తర్వాత టీడీపీతో లింక్ పెట్టి ప్రచారం..!
పవన్ కల్యాణ్ వ్యక్తిగత ఇమేజ్ను డ్యామేజ్ చేయడమే కాదు.. టీడీపీతో లింక్ పెట్టి ప్రజల్లోకి లీకులు పంపితే… ఆ పార్టీని ఎవరూ ప్రత్యామ్నాయంగా చూడరన్న ఆలోచన జగన్ చేశారు. అందుకే.. అసలు ఎలాంటి అవకాశం లేకపోయినా.. టీడీపీతో పొత్తుల చర్చలంటూ.. కథనాలు వండి వారుస్తున్నారు. దీని వెనుక కూడా.. జనసేనను లేకుండా చేయాలనే ఆలోచన.. జగన్‌కు ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ వర్సెస్ వైసీపీ అన్నట్లుగా మారితే.. ఆటోమేటిక్‌గా జనసేన ఓటింగ్ పడిపోతుంది. అలాంటి పరిస్థితి కల్పించడానికే జగన్ ప్రయత్నిస్తున్నారు. జనసేన.. కనీసం ప్రభావవంతమైన ఓట్లు సాధించినా… ఎన్నికల తర్వాత కూడా ఆ పార్టీ బలంగా నిలబడుతుంది. అది వైసీపీకి ఎప్పటికైనా మైనస్సే. అందుకే.. ఎన్ని బైపోలార్ తీసుకొచ్చి.. పవన్ ను ఎవరూ సీరియస్‌గా తీసుకోవడం లేదని.. ఓట్ల ద్వారా చెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్లాన్ వెనుక లక్ష్యం.. జనసేన అంతమే..!
ఇప్పుడు వ్యక్తిత్వ హననానికి ప్రయత్నాలు..!
పవన్ కల్యాణ్‌ను జగన్‌ను ఎంతగా టార్గెట్ చేశారో.. కర్నూలులో రేణు దేశాయ్ ప్రత్యక్షమవడంతోనే ఈజీగా అర్థం చేసుకోవచ్చు. జనసేన పార్టీ పెట్టిన తర్వాత పూర్తి స్థాయిలో తొలి సారి కర్నూలు పర్యటన చేపట్టారు పవన్ కల్యాణ్. అక్కడ చీలే ప్రతి ఒటూ.. తనకు మైనస్ అవుతుందని గట్టిగా నమ్మారు. అందుకే.. పవన్‌కు ఎక్కడా అడ్వాంటేజ్ రాకుండా.. ఉన్న పళంగా.. రేణుదేశాయ్‌ని పిలిపించారు. ఆమెకు సాక్షిలో యాంకరింగ్‌గా.. బాధ్యతలు అప్పగించి.. అదే కర్నూలు జిల్లాకు పంపించారు. ఈ విషయం తెలిసినప్పటి నుంచి … పవన్ టూర్ గురించిన వివరాలు పక్కకుపోయాయి. పవన్ – రేణు వ్యవహారం చర్చకు వచ్చింది. ఈ మొత్తం సులువుగా చూస్తే.. రియల్ ఫ్యాక్షనిజంలో.. మనిషిని నరికేస్తారు.. కానీ ప్రస్తుతం పవన్ కల్యాణ్ పై జగన్… మైండ్ గేమ్ ఫ్యాక్షనిజం ప్రదర్శిస్తున్నారు. వ్యక్తిత్వాన్ని నరికేసి.. జనసేనను అంతం చేయాలనుకుంటున్నారు.