తెలంగాణ రాష్ట్ర సమితి కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్… తాను కింద నుంచి ఎదిగి వచ్చిన రాజకీయ నేతలా ఫీలైపోతున్నారు. టీఆర్ఎస్ అనే పార్టీకి… పిల్లర్‌గా పని చేసిన హరీష్‌రావును పక్కన పెట్టేసి.. విజయవంతంగా.. పార్టీకి తానే వారసుడ్నని నిరూపించుకుంటున్న సందర్భం కాబట్టి.. ఆ ఉత్సాహం మరింత ఎక్కువగానే ఉంటోంది. మోడీ దగ్గర్నుంచి చంద్రబాబు వరకూ ఎవర్నీ వదిలి పెట్టడం లేదు. ఇష్టం వచ్చినట్లు విమర్శించేస్తున్నారు. అదే సమయంలో తన తండ్రిని ఆకాశానికెత్తేస్తున్నారు. ఈ క్రమంలో ఆయనను ఆశోకచక్రవర్తితో పోల్చారు. ఆహా..ఓహో ఆనుకోవాలి..!
చక్రవర్తి అయితే ప్రజలను పట్టించుకోరా..?
ఆశోకుడు చెట్లు నాటించాడు… కేసీఆర్ హరిత హారంతో.. కోట్ల మొక్కలను ప్రతి ఏటా నాటిస్తున్నారు. వాటిలో ఎన్ని బతుకుతున్నాయి. .. ఎన్ని చచ్చిపోతున్నాయి.. ఎన్ని నిర్వహణ లేక.. మధ్యలోనే విరిగిపోతున్నాయన్న విషయం పక్కన పెడితే.. నాటించిన విషయంలో మాత్రం.. అశోకచక్రవర్తికి కేసీఆర్‌కు.. పెద్దగా తేడా లేదు. కానీ మిగతా విషయాల మాటేమిటి..?. ఆర్మూర్‌లో ఎర్రజొన్న, పసుపు రైతులు.. గత నెల రోజులుగా.. ఆందోళన చేస్తున్నారు. వారి ఆందోళనను.. అశోక చక్రవర్తి గారి మంత్రులు కానీ.. అధికారులు కానీ..ఇంత వరకూ.. ఒక్కసారి కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కానీ ఆ రైతుల సంగతి చూడమని.. పెద్ద ఎత్తున పోలీసు బలగాల్ని పంపారు. కానీ చక్రవర్తి అయినా చూసుకోవాల్సింది ఆ పద్దతిలో కాదేమో..?. రైతులు ఎకరానికి రూ. నాలుగు వేలు ఇస్తూ.. దాన్ని దేశం అంతా ప్రచారం చేసుకుంటూ.. చేతికి ఎముక లేని చక్రవర్తిగా పేరు తెచ్చుకుటున్నారు… అసలు విషయం ఆ నాలుగు వేలు కాదని.. రైతు గౌరవంగా బతికేలా.. పడిన కష్టానికి ప్రతిఫలం దక్కేలా… పండింటిన పంటకు గిట్టుబాటు ధర దక్కితే.. రైతు ఆత్మగౌరవంతో బతుకుతారని ఆశోకచక్రవర్తికి తెలియదా..?
పుల్వామా ఘటన కన్నా ఎక్కువ మంది చనిపోయినా చక్రవర్తులు స్పందించరా..?
మొన్నా మధ్య కొండగట్టు అంజన్న దగ్గర.. ఓ ఆర్టీసీ బస్సులో వంద మందికిపైకి కుక్కి తీసుకెళ్తూ.. వాళ్లందరి ప్రాణాలను కాలరాసిన ఘటన గుర్తుండే ఉంటుంది. పుల్వామా లో.. ఉగ్రవాదులు జరిపిన దాడిలో 42 మంది చనిపోయారు. భద్రతా వైఫల్యం ఉందని.. అందరూ నెత్తినోరు బాదుకుంటున్నారు. మరి.. ఒక్క మామూలు ఆర్టీసీ వంద మందిని కుక్కేసి.. ఘాట్‌రోడ్డులో తీసుకురావడం… భద్రతా వైఫల్యమా..? బడుగల ప్రాణాలేనని నిర్లక్ష్యమా..? . పోనీ .. ఆ కుటుంబాలనైనా ఆదుకున్నా.. అంటే… పాపం.. ఆ మృతదేహాలను పెట్టుకోవడానికి ఫ్రీజర్ బాక్సులకు డబ్బుల్లేక.. ఐస్ గడ్డలు తెచ్చుకుని.. దానిపై మృతదేహాలను పెట్టి… పైన పొట్టు కప్పి… వలసపోయిన తమ కుటుంబసభ్యులకు చివరి చూపు చూపించేందుకు తంటాలు పడిన వ్యవహారం… ప్రతి ఒక్కరి కంటా కన్నీరు పెట్టింది. తర్వాత వాళ్లే ఇస్తామన్న పరిహారం కోసం… ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగి .. కన్నీళ్లు పెట్టుకున్న వైనం మీడియాలో వచ్చింది. చక్రవర్తులుంగారు మాత్రం.. కనీసం పట్టించుకోలేదు. ఇది వారికి చిన్న విషయం కావొచ్చు. కానీ ప్రాణాలు విలువ అందరిదీ ఒకటే ఉంటుంది కదా..!
చక్రవర్తులు అయితే పోలీసుల్ని రాజకీయాలకు వాడేసుకుంటారా..?
తెలంగాణ చక్రవర్తుల వారు.. గత ఐదేళ్ల కాలంలో.. పోలీసుల్ని కేవలం రాజకీయాలకు మాత్రమే వాడుకున్నారు. ఓ డ్రగ్స్ కేసు.. ఓ నయీం కేసు… ఓ జయరాం మర్డర్ కేసు.. ఇలా అన్నీ… రాజకీయ ప్రత్యర్థుల దగ్గరకే పోతాయి… కానీ.. టీఆర్ఎస్ లో ఉన్న నేతలెవరి దగ్గరకూ ఎందుకు వెళ్లలేదో మరి..! ఫిల్మ్ ఇండస్ట్రీని గుప్పిట్లో పెట్టుకోవడానికి డ్రగ్స్ కేసు… ఇతర పార్టీల్లోని రాజకీయ ప్రత్యర్థులను.. గుప్పిట పట్టడానికి నయీం కేసును బాగానే ఉపయోగించుకున్నారు. జయరాం మర్డర్ కేసులో.. అప్పటి టీడీపీ నేతలంతా.. ఇప్పుడు టీఆర్ఎస్ నేతలే కదా..! అదేంటో.. ఇప్పుడు.. మిగిలిన .. అడుగుబొడుగు ఉన్న టీడీపీ నేతల దగ్గరకే ఆ కేసు వెళ్తోంది. కానీ.. జయరాం మర్డర్ కేసులో.. అసలు విషయం ఏమిటో తేల్చడానికి మాత్రం ఎందుకు సంకోచిస్తున్నారో చక్రవర్తులకే తెలియాలి..!
చక్రవర్తులు ఇప్పుడు సామంతరాజ్యం కోసం ప్రయత్నిస్తున్నారా…?
తెలంగాణ అశోకచక్రవర్తిగారు.. ఇప్పుడు.. పొరుగు రాష్ట్రాన్ని సామంత రాజ్యం చేసుకోవడానికి.. యుద్ధం ప్రారంభించినట్లు ఉన్నారు. అక్కడ పోటీ పడుతున్న ఓ ప్రత్యర్థిగా ఔట్‌రైట్‌గా మద్దతిచ్చి… . ఆయనకు చెందిన ఎంపీలను.. గుప్పిట పట్టేసి.. ఢిల్లీకే చక్రవర్తి అవుతుదామని ప్రయత్నిస్తున్నారు. ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లుగా… ఇంత కాలం ఎవర్ని అయితే తిట్టి.. తెలంగాణ ఉద్యమం నడిపారో.. వారినే మెట్లుగా చేసుకుని దేశ్‌కి చక్రవర్తి అయ్యేందుకు ప్రయత్నించడం… సుడి కాకపోతే మరేమిటి..?. ఎంతైనా… చక్రవర్త కళలు అలాగే ఉంటాయి కదా.. మరి..!