పాకిస్తాన్ చెరలో ఉన్న అభినందన్ వర్ధమాన్ శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకే విడుదలవుతారని.. అటు పాకిస్తాన్ మీడియా.. ఇటు భారత్ మీడియా కూడా.. ప్రచారం జరిగింది. దానికి తగ్గట్లుగానే వారు.. వాఘా బోర్డర్‌కు 23 కిలోమీటర్ల దూరంలో ఉన్న లాహోర్కి రెండు గంటలకే చేరుకున్నారు. కానీ.. అటారి చెక్‌పోస్ట్ దగ్గరకు వచ్చే సరికి… ఎన్నో అడ్డంకులు. యుద్ధఖైదీగా ఉన్న… అభినందన్‌ను స్వదేశానికి తీసుకెళ్లడానికి అవసరమైన పత్రాలు సర్దుబాటు చేసుకోవడంలో… వాటిని సమకూర్చుకోవడానికి సమన్వయం చేసుకోవడంలో… విఫలం కావడంతో పరిస్థితి మారిపోయింది. కానీ.. అక్కడా.. ఇమ్రాన్ ఖానే రంగంలోకి దిగారు. ఆయన అభినందన్‌ను ఎలాంటి ఇబ్బందులు లేకుండా.. సరిహద్దులు దాటించడానికి స్వయంగా లాహోర్ వచ్చారు. మధ్యాహ్నం తర్వాత అక్కడే మకాం వేసి.. అభినందన్ ను బోర్డర్ దాటించే వరకూ.. ఉన్నారు. ఎదురైన ఇబ్బందుల్ని అక్కడికక్కడ పరిష్కరించారని.. భారత ప్రముఖ మీడియా సంస్థలు చెబుతున్నాయి.
వెల్కం అభినందన్ పేరుతోనే… భారతదేశం.. ఈమేల్కొంది. శుక్రవారం రోజంతా… దేశ ప్రజలందరి దృష్టి వాఘా బోర్డర్ వైపే. శత్రువు చేత చిక్కినప్పటికీ.. కళ్లల్లో ఇసుమంతైనా భయం కనిపించని… ఆ ధైర్యశాలి, భరతమాత ముద్దు బిడ్డ.. ఎప్పుడు… సొంతగడ్డపై అడుగు పెడతారని.. ప్రజలంతా.. ఉత్కంఠగా ఎదురు చూశారు. ఆ ఎదురు చూపులు రోజంతా సాగాయి.. శుక్రవారం అభినందన్‌ను విడుదల చేస్తామని ఇమ్రాన్ ఖాన్ ప్రకటించడంతో.. దానికి తగ్గట్లుగా భారత ప్రభుత్వం, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అధికారులు.. అభినందన్‌కు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. అభినందన్‌కు చెందిన పాస్‌పోర్టు, ఇతర పత్రాలతో.. ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సీనియర్ అధికారి ఒకరు ఉదయమే పాకిస్తాన్ వెళ్లారు. అక్కడ లాంచనాలన్నీ పూర్తి చేశారు. అభినందన్ కోసం.. ప్రత్యేక విమానాన్ని పంపుతామని.. అనుమతించాలని పాకిస్థాన్‌ను భారత ప్రభుత్వం కోరింది. కానీ.. పాకిస్తాన్ మాత్రం.. వాఘా బోర్డర్ ద్వారా మాత్రమే అభినందన్‌ను పంపుతామని స్పష్టం చేసింది. దాంతో.. ఇస్లామాబాద్‌లో… లాంచనాలన్నీ పూర్తి చేసిన తర్వాత.. అభినందన్‌ను అంతర్జాతీయ రెడ్‌క్రాస్ సొసైటీకి అప్పగించారు. అక్కడ్నుంచి లాహోర్‌కు అభినందన్‌ను తీసుకొచ్చారు. )
అంతర్జాతీయ రెడ్ క్రాస్ నిబంధనలు…. పాకిస్తాన్ బీటింగ్ రీట్రీట్ ప్రక్రియ… అభినందన్‌కు సంబంధించిన కొన్ని పత్రాల విషయంలో అభ్యంతరాలు.. ఇలా రకరకాల కారణాల వల్ల.. వాఘా కన్నా ముందు ఉన్న అటారి …చెక్‌పోస్ట్ వద్ద… అభినందన్ వాహనశ్రేణి నిలిచిపోయింది. ఆ సమయంలోనే … సోషల్ మీడియా సైనికులు మరోసారి రెచ్చిపోయారు. పాకిస్తాన్ అడ్డంకులు పెడుతోందని.. కొన్ని షరతులు పెడుతోందని ప్రచారం ప్రారంభించారు. కానీ.. ఏ అడ్డంకులు లేకుండా.. నిబంధనల ప్రకారం పేపర్ వర్క్ లో ఎదురయిన ఇబ్బందులను సైతం.. ఇమ్రాన్ ఖాన్ పరిష్కరించి పంపించారని.. తాజాగా తేలింది.