హారిక హాసిని అనుబంధ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ పతాకం మీద కళ్యాణ్ రామ్ ఓ సినిమా చేయాల్సి వుంది. ఈ మేరకు గతంలో వార్తలు వినిపించాయి. ఉయ్యాల జంపాల ఫేమ్ విరించి వర్మ దర్శకుడు. అయితే ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే ఆ సినిమా వుంటుందా? అన్న అనుమానం కలుగుతోంది.
ఇప్పటికే సితార ఎంటర్ టైన్ మెంట్స్ రెండు సినిమాలు ఫినిష్ చేసే పనిలో వుంది. వాటి సంగతి అలా వుంచితే నితిన్-వెంకీ కుడుమల సినిమా ఎప్పటి నుంచో, ఇదిగో అదిగో అంటూ అలా వుంది. ఇంకోపక్క ఇటీవల కళ్యాణ్ రామ్ పలు ఇంటర్వూల్లో మాట్లాడుతూ, రెండు మూడు సబ్జెక్ట్ లు ఓకే చేసానని చెప్పారు కానీ, స్వంత బ్యానర్ నా, బయట బ్యానర్ నా అన్నది క్లారిటీ ఇవ్వలేదు. ఆయన మాటల్లో ఎక్కడా సితార ఎంటర్ టైన్ మెంట్స్ ప్రస్తావనలేదు.
సాక్ష్యం సినిమా తరువాత ఖాళీగా వున్న దర్శకుడు శ్రీవాస్ ఓ కథను కళ్యాణ్ రామ్ దగ్గర ఓకె చేయించుకున్నారు. దానికి నిర్మాతను వెదుకుతున్నారు. కొత్త దర్శకుడు ఒకరు చెప్పిన కథను కళ్యాణ్ రామ్ ఒకే చేసి తానే నిర్మిస్తా అని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఇవన్నీ చూస్తుంటే సితార ఎంటర్ టైన్ మెంట్స్ సినిమా ఇప్పట్లో వుండకపోవచ్చేమో?