వైజాగ్‌లో ఉన్న బ్లూ ఫ్రాగ్ అనే కంపెనీ, ఐటీ గ్రిడ్ కంపెనీలు టీడీపీ అధినేత చంద్రబాబు బంధువులవి అన్నట్లుగా అనుమానాలు కల్పించేందుకు జగన్ ప్రయత్నం చేశారు. ఇందులో బ్లూ ఫ్రాగ్ కంపెనీ నేరుగా ప్రభుత్వానికి సేవలు అందిస్తుంది. బ్లూ ఫ్రాగ్ కంపెనీ ప్రభుత్వ లబ్దిదారుల్ని గుర్తించడం, జియో ట్యాగింగ్ చేయడం, నకిలీల్ని నివారించడానికి ఆధార్‌తో అనుసంధానం చేయడం చేసే సేవల్ని అందిస్తుంది. 2008లోనే … ఉమ్మడి రాష్ట్రంలోనే.. సీఎంగా వైఎస్ ఉన్నప్పుడే.. ఈ సంస్థకు కాంట్రాక్ట్ ఇచ్చారు. ఈ కంపెనీకి కర్త, కర్మ, క్రియగా వ్యవహరించే పిన్నుపురెడ్డి జయ ఆదిత్యరెడ్డి. ఈయన చంద్రబాబు సామాజికవర్గం మనిషి కాదు.
బ్లూఫ్రాగ్ కంపెనీకి డేటా ప్రభుత్వం ఇవ్వదు. ఆధార్ సమాచారం కూడా ఆ కంపెనీ వద్ద ఉండదు. కేవలం జియో ట్యాగింగ్, ఆధార్ ఐడెంటిఫికేషన్ మాత్రం చేస్తుంది. సదరు లబ్దిదారులు.. వేలి ముద్ర వేసినప్పుడు అతని వివరాలు మాత్రమే వస్తాయి. దాని ద్వారా నిర్ధారించుకుంటారు. దాంతో… పని అయిపోతుంది. ఆ డేటా ఏమీ వినియోగించుకున్న కంపెనీ కానీ.. ప్రభుత్వం లేదా సంస్థ దగ్గర కానీ నిల్వ కాదు. ఎయిర్ టెల్, జియో లాంటి ప్రైవేటు సంస్థలకు ఎంత యాక్సెస్ ఉంటుందో.. ప్రభుత్వం తరపున పని చేసే బ్లూఫ్రాగ్స్కు కూడా అంతే… పర్మిషన్ ఉంటుంది. కాపీ చేయడానికి వారి దగ్గర ఆధార్ డేటా ఉండదు. చోరీ చేయాడనికి.. డేటా గ్రిడ్‌కు చాన్స్ ఉండదు.
ఏ సంస్థ అయినా… నిజాయితీగా సేవలు అందిస్తుందనే నమ్మకం ఉంటేనే… పురోగతి సాధిస్తుంది. ఈ విషయంలో బ్లూఫ్రాగ్స్కు మంచి ట్రాక్ రికార్డు ఉంది. ఆ విషయం ఆ కంపెనీ క్లయింట్ లిస్ట్ చెబుతుంది. ప్రపంచ బ్యాంక్ దగ్గర్నుంచి … ఉపాధి హామీ పథకం వరకు..అనేక అంశాల్లో ఈ కంపెనీ జియోట్యాగింగ్ సేవలు అందిస్తుంది. అంత ఎందుకు.. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కూడా క్లయింట్ లిస్టులోఉంది. జగన్‌కు … ఏపీ ప్రభుత్వంలో ఉన్న పోలీసులు.. ప్రభుత్వానికి సేవలు అందిస్తున్న కంపెనీలు.. అన్నీ.. చంద్రబాబు బినామీలుగానే అనిపిస్తంటారు. అలాగే.. ఈ కంపెనీలు కూడా అలా అనిపించి ఉంటాయి.