తెలుగుదేశం పార్టీకి చెందిన సేవా మిత్ర యాప్ పై విడిగి ఫిర్యాదు తీసుకున్న హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్… ఆ యాప్ ద్వారా సర్వేలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఫోన్లు చేసి.. ఏ పార్టీకి ఓటేస్తారని అడుగుతున్నారని.. ఇది నేరమని.. ఆయన విశ్లేషించారు. ఏ సామాజికవర్గం, ఏం చదవుతుకున్నారు.. ఏ ఉద్యోగాలు చేస్తున్నారో తెలుసుకుంటున్నారని.. ఆ సమాచారాన్ని ఐటీ గ్రిడ్ సంస్థ విశ్లేషించి బూత్ కన్వీనర్లకు పంపుతుందని చెప్పుచొచ్చారు. సేవా మిత్ర యాప్ ద్వారా ఎన్నికల సరళిపై సర్వే చేస్తున్నారని.. క్షేత్రస్థాయిలో ఆధార్ నంబర్, విద్య, సామాజికవర్గం వివరాలు సేకరిస్తున్నారని సీపీ చెప్పుకొచ్చారు. క్షేత్రస్థాయిలో సేకరించిన సమాచారాన్ని ఐటీ గ్రిడ్ పరిశీలిస్తోందిన్నారు. సేవా మిత్ర వెబ్సైట్లో బూత్ కన్వీనర్, డ్యాష్ బోర్డు వివరాలు, సర్వేయర్ల నుంచి సమాచారం టీడీపీ బూత్ లెవల్ నేతలకు వెళ్తుందని చెప్పుకొచ్చారు.
మొదటగా సేవా మిత్ర యాప్ ఎలా పని చేస్తుందో.. అంజనీకుమార్ వివరించారు. ఐటీ గ్రిడ్ సంస్థ కు వివరాలు ఎలా వస్తాయో.. ఎని పనితీరు ఉంటుందో చెప్పారు. ఇందులో.. కేసు పెట్టేంత తీవ్ర నేరం.. అంటే… ఈ సమాచారాన్ని ఎన్నికల్లో ఎలా ఉపయోగించుకుంటారో… విశ్లేషించాల్సి ఉందన్నారు. టీడీపీకి ఓటు వేయరని తెలిస్తే.. ఆ ఓటును తొలగించడానికి…ప్రయత్నం చేస్తారనే అనుమానాలున్నాయన్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తి..నిందితునిగా ఉన్న వ్యక్తి హైదరాబాద్ లోనే ఉంటున్నారని.. అందుకే కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఇదే అంశంపై.. మరో కేసు సైబరాబాద్ పరిధిలో ఉంది కాబట్టి…రెండు కమిషనరేట్లు కలిసి దర్యాప్తు చేస్తామని అంజనీకుమార్ చెప్పుకొచ్చారు
అసలు హైదరాబాద్ కమిషనర్.. యాప్ ఎలా పని చేస్తుందో చెప్పడానికి సమయం కేటాయించారు. ఓ గ్రాఫ్ ఇచ్చారు. కానీ.. అందులో నేరం ఏమిటో మాత్రం చెప్పలేకపోయారు. అన్ని సంస్థలు, రాజకీయ పార్టీలు సర్వేలు చేసుకుంటాయి. ఇప్పుడు ఆ సర్వే సంస్థలు కోకొల్లలుగా ఉన్నాయి. సర్వేకు సిద్దపడిన వారే సమాచారం ఇస్తారు. లేకపోతే లేదు. అది నేరమని ఎక్కడా లేదు. తన ప్రెస్మీట్లో సీపీ నేరం జరిగిందని ఎక్కడా చెప్పలేదు. ఆన్లైన్ సర్వే ద్వారా ఓట్లు తొలగిస్తున్నారనే వివాదం అని చెప్పుకొచ్చారు. అలాంటిదేమీ ఉండదని.. ఎన్నికల కమిషన్ దగ్గర ఉన్న డాటాను ఎవరూ ఎడిట్ చేయలేరని చెప్పింది. ఐపీఎస్ స్థాయి అధికారులకు అది తెలియనిది కాదు. కానీ.. అంజనీకుమార్… మాత్రం.. అసలు కేసేమిటో చెప్పకుండా.. లోతుగా దర్యాప్తుగా చేస్తామని ముగింపునిచ్చారు.