తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 2019-2021 కార్యవర్గ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి. నాలుగు దశాబ్దాలకి పైగా చరిత్ర ఉన్న తానాలో మొదటిసారిగా మూడు విభాగాలకు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, కార్యనిర్వాహక వర్గం (ఎగ్జిక్యూటివ్ కమిటీ), తానా ఫౌండేషన్ అన్ని పదవులకు అభ్యర్థులు పోటీ లేకుండా ఎన్నికయ్యారని తానా బోర్డు చైర్మన్ చలపతి రావు కొండ్రగుంట ప్రకటించారు. కీలకమైన పదవులకు కూడా ఈసారి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవడం విశేషం. ఎన్నికల బాధ్యత సమర్ధవంతంగా నిర్వహించిన ఎన్నికల కమిటీ చైర్మన్ శ్రీ కనకంబాబు ఐనంపూడి, సభ్యులు శ్రీ ఆంజనేయులు కోనేరు, శ్రీ రాజా ముత్యాలకు తానా కార్యవర్గం కృతజ్ఞతలు తెలియజేసారు. చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకుని ఎన్నికలు ఏకగ్రీవం అవడానికి ముఖ్యకారణమయిన రాజా సూరపనేని కి మరియు నూతన కార్యవర్గానికి అభినందనలు తెలియజేస్తూ ఈ ఎన్నికలు ఏకగ్రీవంగా నిర్వహించటానికి సహకరించిన అధ్యక్షులు సతీష్ వేమన, పూర్వాధ్యక్షులు డా. జంపాల చౌదరి, గంగాధర్ నాదెళ్ళ, కోమటి జయరాం ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ జై తాళ్లూరి తదితరులకు బోర్డు చైర్మన్ చలపతి రావు కొండ్రగుంట ధన్యవాదాలు తెలియజేసారు.