రాఫెల్ డీల్‌పై గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించమంటూ.. దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు అంగీకరించింది. విచారణ ప్రారంభించింది. ప్రశాంత్ భూషణ్, యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీలు ఈ పిటిషన్లు వేశారు. ఇందులో ప్రశాంత్ భూషణ్ ప్రముఖ అడ్వకేట్. యశ్వంత్ సిన్హా, అరుణ్ శౌరీలు మాజీ బీజేపీ నేతలు. రాఫెల్ పై ఇటీవల కాలంలో.. అనేక వివరాలు బయటకు వచ్చాయి. హిందూ పత్రికలో వచ్చిన కథనాలు చూపించిన సాక్ష్యాలను.. చూపించి గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించాలని కోరారు.
రాఫెల్ పత్రాలు పోయాయని సుప్రీంకోర్టులో వాదించిన కేంద్రం..!
హిందూ పత్రికలో వచ్చిన ఆధారాను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు తాము గతంలో ఇచ్చిన తీర్పును సమీక్షించేందుకు అంగీకరించారు. దీనిపై వాదనలు ప్రారంభమయ్యాయి. ఈ వాదనల్లో ప్రభుత్వం తరపున లాయర్ వింత వాదన వినిపించారు. హిందూపత్రికలో ప్రచురితమైన… కీలకమైన రక్షణ శాఖకు చెందిన డాక్యుమెంట్లు.. రక్షణ శాఖ నుంచి చోరీ అయ్యాయని వాదించారు. దేశ చరిత్రలో ఇంత వరకూ ఎవరూ ఇలా చెప్పి ఉండదు. దేశరక్షణకు చెందిన పత్రాలు.. రక్షణ శాఖ కార్యాలయం నుంచే పోయాయని చెప్పడం.. కనీవినీ ఎరుగనిది. దీనిపై.. కేసు నమోదు చేస్తున్నామని… ఈ పత్రాలు ప్రచురించిన… హిందూ పత్రిక ఎడిటర్ పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేరుస్తున్నామని…సుప్రీంకోర్టు ముందు కేంద్ర ప్రభుత్వ న్యాయవాది వాదించారు. వీటిని రక్షణశాఖ పరంగా అత్యంత కీలకమైన డాక్యుమెంట్లులా వర్గీకరించామని కూడా.. కేంద్రం చెబుతోంది. అందుకే ఈ డాక్యుమెంట్లు బయటపెట్టడం లేదు. అవి దేశ రక్షణకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు,.. అందుకే బయటపెట్టడం లేదనే వాదన వినిపిస్తున్నారు.
దేశరక్షణ పత్రాలు కూడా కాపాడలేకపోతే దేశాన్నేం కాపాడతారు..?
బయటకు చెబితేనే దేశ రక్షణ ప్రమాదంలో పడే పరిస్థితుల్లో ఉన్న డాక్యుమెంట్లు.. దొంగతనానికి గురయినట్లు చెబుతున్నారు. అంటే.. దేశ రక్షణ శాఖకు అత్యంత కీలకమైన డాక్యుమెంట్లకు కూడా రక్షణ లేదా..? . దేశ రక్షణ శాఖ తన దగ్గర ఉన్న డాక్యుమెంట్లను కాపాడుకోలేకపోతే… ఇక దేశాన్ని ఏమి కాపాడుతుంది. ఇవాళ హిందూ పత్రిక రామ్ చేతుల్లోకో.. ప్రశాంత్ భూషణ్ చేతుల్లోకో కాకుండా.. పాకిస్తాన్ చేతుల్లోకి పత్రాలు పోతే.. దేశ రక్షణ ఏం కావాలి..?. ప్రధానమంత్రి తాను పదే పదే చౌకీదార్ అని చెబుతూ ఉంటారు., చౌకీదార్ ఉండగానే చోరీ ఎలా జరిగింది. ఏదైనా అపార్టుమెంట్లో చౌకీదార్ ఉండగానే చోరీ జరిగితే.. చౌకీదార్ పై చర్య తీసుకుంటారా లేదా..?. భారత ప్రభుత్వం చెప్పిన దాని ప్రకారం.. తమ ప్రభుత్వం ఈ డాక్యుమెంట్లను భద్రంగా ఉంచలేకపోయింది… అవి దొంగతనానికి గురయ్యాయని వాదించింది.
దొంగిలించిన పత్రాలు సాక్ష్యాలుగా పనికి రావంటున్న కేంద్రం..!
రాఫెల్ డీల్స్‌పై.. కీలకమైన పత్రాలు దొంగతనానికి గురయ్యాయని కేంద్రం వాదించడానికి ఓ కీలకమైన కారణం ఉంది. ఆ పత్రాలు దొంగతనానికి గురయ్యాయి.. ఆ దొంగతనానికి గురైన పత్రాలు సాక్ష్యాలుగా పనికి రావని కేంద్రం చెబుతోంది. ఇతర డాక్యుమెంట్లు పెట్టమని అడిగితే.. అవన్నీ సీక్రెట్ అని చెబుతోంది. హిందూ పత్రిక బయట పెట్టిన వివరాలు.. రాఫెల్‌పై అధికారిక సంప్రదింపుల కమిటీ ఇచ్చిన నివేదిక. దాన్ని కాదనే అవకాశం లేదు. కానీ దొంగతనం పేరుతో.. ఆ సాక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవద్దని వాదిస్తున్నారు. దీనిపై… రివ్యూ పిటిషన్ల తరపున వాదిస్తున్న న్యాయవాది.. ఏదైనా నేరం జరిగినప్పుడు.. అ నేరానికి సంబంధించిన డాక్యుమెంట్లు చోరీకి గురయితే.. ఇక విచారించకూడదా.. అని ప్రశ్నించారు. దీనికి ప్రభుత్వ న్యాయవాది వద్ద సమాధానం లేదు. సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది.. ఆ డాక్యుమెంట్లు దొంగిలించినవా కాదా.. అని కాదు.. నిజామా.. కాదా చెప్పండి.. అని ప్రశ్నించింది. కానీ దీనిపై ప్రభుత్వ న్యాయవాది వద్ద ఆన్సర్ లేదు. కానీ కోర్టు పరిధిలోకి రావు.. అని వాదిస్తోంది.
సుప్రీంకోర్టులో విచారణ వద్దంటున్న కేంద్రం..! క్లీన్ చిట్ ఇచ్చారని ఎందుకు ప్రచారం..!?
ఓ వైపు.. సుప్రీంకోర్టులో.. ఈ కేసును… వాదించకూడదు.. అని కేంద్రం వాదిస్తోంది. మరో వైపు దేశంలో.. మాత్రం ఎన్నికల ప్రచారసభల్లో తిరిగి.. సుప్రీంకోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది అని చెబుతున్నారు. విచారించడానికే అనుమతి లేని వ్యవస్థ .. అనుకూలంగా తీర్పు ఇస్తే.. ఎలా చెప్పుకుంటున్నారు. హిందూపత్రికలో.. వచ్చిన ఆధారాలు .. కొన్ని వాస్తవాలను ప్రజల ముందు ఉంచాయి. సావరిన్ గ్యారంటీ ఎత్తి వేశారు, బ్యాంక్ గ్యారంటీ ఎత్తి వేశారు. అంతకు ముందు టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఉంది. ఇప్పుడు లేదు. గతంలో ఆర్బిట్రేషన్ మనకు అనుకూలంగా ఉండేది. ఇప్పుడది లేదు. పైగా వాళ్లకు అనుకూలంగా ప్రొవిజన్ ఉంది. ఆఖరికి న్యాయశాఖ సిఫార్సులు కూడా పక్కన పెట్టి… దసాల్ట్‌తో కంపెనీతో ఒప్పందం చేసుకున్నారు. ఇలా దసార్ట్ కంపెనీకి లాభం కలిగేలా ఒప్పందం చేసుకున్నారు. ఇలా ఎందుకు చేశారు..? అనిల్ అంబానీ ఎలా ఆఫ్సెట్ పార్టనర్‌గా వచ్చారు…? ఇవన్నీ.. అనుమానాలు. వీటిపై సమాధానం రాకుండా.. బయటకు వచ్చిన డాక్యుమెంట్లు మాత్రం.. దొంగతనానికి గురయ్యాయని చెప్పి… తప్పించుకునే ప్రయత్నం చేసింది.