తెలుగుదేశం పార్టీ యాప్.. సేవామిత్ర మీద.. ఓ ఆపరేషన్ చేస్తున్న హైదరాబాద్ పోలీస్ కమిషనర్…ఓ స్కెచ్ వేశారు. ఆ స్కెచ్ వేసి.. యాప్ ఎలా పని చేస్తుందో చెప్పారు. ఆ యాప్ లక్ష్యం.. ఓట్లు తొలగించడమేనని.. కందుల రంగారెడ్డి, కందుల నాగమణి అనే తండ్రీకూతుళ్ల ఓట్లను కేస్ స్టడీగా తీసుకున్నారు. ఓ భారీ ప్రెస్‌మీట్ పెట్టి… చెప్పాల్సినదంతా చెప్పారు. వారిద్దరూ హైదరాబాద్‌లోని అమీర్‌పేటలో ఉంటున్నప్పటికీ.. వారి ఓట్లు విజయవాడలో ఉన్నాయని… ఈ యాప్ ద్వారా సర్వే చేసిన తర్వాత వారి ఓట్లు మిస్సయ్యాయని… సైబరాబాద్ కమిషనర్… అంజనీకుమార్.. ఓ గొప్ప పరిశోధన చేసినట్లు ప్రకటించుకున్నారు. కానీ ఆయన చిన్న లాజిక్ మిస్సయ్యారు. ఏపీ ఓట్ల జాబితాలో.. ఆన్లైన్లో సెర్చ్ చేసి.. ఇప్పుడు .. ఐ ఐడీ నెంబర్‌తో స్టేటస్ నాట్ ఫౌండ్ అని ఉందని.. కాబట్టి తీసేశారని.. చెప్పుకొచ్చారు.
నిజానికి ఆయన అలాంటప్పుడు ఏం చేయాలి… ఈసీని సంప్రదించాలి. ఎందుకంటే.. ఓ నేరం జరుగిందనుకున్నప్పుడు.. అధికారిక సమాచారం తెలుసుకోవాలి. కానీ.. ఆయన తనకు కావాల్సింది దొరికిందని.. ప్రెస్‌మీట్ పెట్టారు. కానీ.. ఓ సామాన్య పౌరుడుగా ఆలోచించినా.. ఆయన .. ఆ ఓటు పోవడంలో మర్మం తెలుసుకుని ఉండేవారు. విజయవాడకు చెందిన వారైనప్పటికీ.. వారు హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. అక్కడ ఓటు నమోదు చేయించుకున్నారేమో అని పరిశీలించాల్సింది. ఇప్పుడు ఆ పనిని నెటిజన్లు.. ఓ భారీ వ్యవస్థ ఉన్న పోలీసు అధికారుల కంటే గొప్పగా చేసి… ఆన్లైన్లో పెట్టారు.
విజయవాడలో ఓటు పోయిందని.. హైదరాబాద్ కమిషనర్ … ప్రెస్మీట్లో ఎంత బాధపడ్డారో కానీ.. ఆ ఓటు హైదరాబాద్‌లోనే.. ఆయన కమిషనరేట్ పరిధిలోనే దొరికిందని… నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఎన్నికల సంఘం డాటాలో ఉన్న రికార్డుని .. వైరల్ చేస్తున్నారు. రెండు ఓట్లు ఉండాలని.. పోలీస్ కమిషనర్ చెబుతున్నారా..? అని ప్రశ్నిస్తున్నారు..? హైదరాబాద్ పోలీసులు ఇప్పుడు ఏమని వివరణ ఇచ్చుకుంటారు..?