తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పుడు… లోక్ సభ ఎన్నికల కసరత్తు ప్రారంభించారు. సన్నాహాక సమావేశాలు పెడుతున్నారు. ప్రతి సభలోనూ.. టీఆర్ఎస్కు పదహారు సీట్లు ఇస్తే… ఢిల్లీని శాసిస్తామని చెబుతున్నారు. ఢిల్లీ గద్దెపై.. ఎవరుండాలో పదహారు సీట్లతో.. తాము నిర్దేశిస్తామంటున్నారు. ఇది సాధ్యమేనా..?
ఢిల్లీలో ప్రాంతీయ పార్టీలకు పనేమిటంటున్న జాతీయ పార్టీలు..!
తెలంగాణలో పదిహేడు పార్లమెంట్ స్థానాలున్నాయి. ఇందులో హైదరాబాద్ ఒకటి మిత్రపక్షం ఎంఐఎంకు వదిలేసి.. మిగతా పదహారు స్థానాలను గెలుచుకోవాలనే పట్టుదలను.. టీఆర్ఎస్ చూపిస్తోంది. సాధారణంగా లోక్ సభ ఎన్నికల విషయంలో… జాతీయ పార్టీలు ఓ మాట అంటూ ఉంటాయి. జాతీయ రాజకీయాల విషయంలో ప్రాంతీయ పార్టీలకు పనేమిటని ప్రశ్నిస్తూ ఉంటాయి. ప్రాంతీయ పార్టీలు ప్రాంతీయ దృక్పధంతోనే ఉంటాయి. జాతీయ స్థాయి ప్రయోజనాల కన్నా.. ముందు తమ రాష్ట్ర ప్రయోజనాలనే కాపాడుకునేందుకు ప్రయత్నిస్తాయి. అందుకే.. జాతీయ స్థాయిలో రాజకీయాలు ఎందుకని.. జాతీయ పార్టీలు అంటూ ఉంటాయి. అలాగే.. ప్రాంతీయ పార్టీలు.. కేంద్రంలో అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఆయా పార్టీలకు .. ఆయా రాష్ట్రాల్లో మాత్రమే బలం ఉంటుంది. కాబట్టి పరిమితంగా సీట్లు గెలుచుకోగలుగుతారు. కానీ.. జాతీయ పార్టీలు అలా కాదు.. దేశవ్యాప్తంగా పోటీ చేస్తాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజార్టీ సాధించడానికి స్కోప్ ఉంటుంది. అందుకే ప్రాంతీయ పార్టీలపై.. జాతీయ పార్టీలు విమర్శలు చేస్తూ ఉంటాయి.
రాహుల్ వర్సెస్ మోడీ అనే వాతావరణం సృష్టించే ప్రయత్నం..!
దేశంలో ఇప్పుడు జాతీయ పార్టీలు కూడా పూర్తి స్థాయిలో మెజార్టీ సాధించే పరిస్థితులు లేవు. అలా లేనప్పుడు.. ప్రాంతీయ పార్టీల మద్దతుతోనే.. కేంద్రంలో ప్రభుత్వాలు ఏర్పడతాయి. గతంలో సంకీకర్ణ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. కొన్ని సక్సెస్ అయ్యాయి. మరికొన్ని ఫెయిలయ్యాయి. అయితే.. ప్రాంతీయ పార్టీలే.. ప్రధానంగా… ప్రభుత్వాలను ఏర్పాటు చేసినప్పుడు అస్థిరత ఏర్పడింది. దాన్నే జాతీయ పార్టీలు ప్రముఖంగా చెబుతూ ఉంటాయి. ప్రస్తుతం … దేశంలో ఎన్నికల పరిస్థితిని మోడీ వర్సెస్ రాహుల్‌గా మారుస్తున్నారు. మోడీ అంటే ఇష్టం లేని వారు రాహుల్‌కి.. రాహుల్ అంటే ఇష్టం లేని వారు..మోడీకి వేయాలన్న వాతావరణం సృష్టిస్తున్నారు. తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా అదే చెబుతున్నారు. ఇది మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ ఎన్నికలను… దీంతో కేసీఆర్‌కు ఎం సంబంధమని వాదిస్తున్నారు.
నెంబగ్ గేమ్ ఏర్పడి..టీఆర్ఎస్ సీట్లే కీలకం అయితేనే..!
ఈ వాదనకు ప్రాంతీయ పార్టీలు బలమైన వాదనతో చెక్ పెడుతున్నాయి. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకోవాలంటే… సంఖ్యాబలం ఉండాలని… ఆ పదహారు సీట్లు ఉంటే… ఢిల్లీని శాసిస్తామని కేటీఆర్ అందుకే అంటున్నారు. కావాల్సినన్ని నిధులు తెచ్చుకోవచ్చని అంటున్నారు. కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వం… కేవలం తెలంగాణ రాష్ట్ర సమితికి వచ్చిన ఎంపీల మీద ఆధారపడి ఉంటే.. కచ్చితంగా.. కేటీఆర్ చెప్పినట్లు… తెలంగాణకు సంబంధించి ప్రయోజనాలను సంపాదించుకోవచ్చు. టీఆర్ఎస్ ఒక వేళ పదహారు గెలుచుకున్నప్పటికీ.. ఢిల్లీలో చక్రం తిప్పాలంటే.. పరిస్థితి కలిసి రావాలి. కాంగ్రెస్ పార్టీకి కానీ.. బీజేపీకి కానీ.. ఆ పదిహేను సీట్లు అవసరం పడాలి. అలాంటి నెంబర్ గేమ్ వస్తేనే.. టీఆర్ఎస్ కేంద్రంలో చక్రం తిప్పడానికి అవకాశం ఏర్పడింది. జాతీయ పార్టీలు కూడా.. ప్రాంతీయ పార్టీలను తేలికగా తీసుకోవడం లేదు. కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలంటే.. మిత్రులను కూడా కలుపుకుని వెళాల్సి ఉంటుంది. మిత్రులకు కూడా మరో దారి లేదు. బీజేపీకి కూడా.. గతంలో ఉన్నన్ని సీట్లు వచ్చే అవకాశం కనిపించడం లేదు. ఇలాంటి సందర్భాల్లో తాము తెలంగాణ ప్రయోజనాలు కాపాడతామని.. కేటీఆర్… చెబుతున్నారు. ఏం జరగాలన్నీ.. టీఆర్ఎస్ గెలుచుకున్న సీట్లే కీలకం కావాలి..!