- ఓ… జైలు నుంచి పోలీస్‌స్టేషన్‌కు సొరంగం తవ్వుకునే బ్రెజిల్ దొంగ..!
- మరో …చిన్న పర్సు కొట్టేసినా దొరికిపోయే బ్రహ్మం..!
- అలాగే.. “మర్డర్ స్కెచ్ వేసి.. ఆ డాక్యుమెంట్‌ను రిజిస్టర్ చేసేసుకునే విజయసాయి..”
వీళ్లు ఎప్పటికి చరిత్రలో నిలిచిపోతారు. కానీ బ్రెజిల్ దొంగ, జులాయిలో బ్రహ్మం విజయసాయిరెడ్డి కంటే చాలా బెటర్. ఎందుకంటే.. వారి ప్రయత్నాల్లో లోపం లేదు. కానీ.. విజయసాయిరెడ్డి .. టీడీపీ పై వేసిన మర్డర్ స్కెచ్‌లో… పర్ఫెక్షన్ ఉంది. కానీ… దాన్ని తనే బయట పెట్టుకోవడం.. అదీ కూడా.. ఇది మాది కాదు.. అని చెప్పుకోలేనంత దుర్భర స్థితిలో.. తనను తానే నెట్టుకోవడం… మాత్రం… ఎవరూ ఊహించలేనంత .. ” మైండ్ బ్లోయింగ్..”
తెలంగాణ సీఎం కేసీఆర్… తెలంగాణ పోలీసుల్ని.. ఇష్టం వచ్చినట్లు వాడేసుకోమని.. చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చే ప్రక్రియలో.. వైసీపీకి ఆఫర్ ఇచ్చేసినట్లు ఉన్నారు. అందుకే… సోషల్ మీడియా కామెంట్లు చేసే వారిని కూడా.. ఆ పోలీసులతో బెదిరించడానికి కంప్లైంట్లు ఇచ్చారు. ఇప్పుడు..ఆ పోలీసుల్ని వాడుకుని ఏకంగా… ప్రభుత్వాన్నే టార్గెట్ చేశారు.. విజయసాయిరెడ్డి. ఏం చేయాలి..? ఎలా చేయాలి..? అన్నదానిపై.. స్పష్టమైన కార్యాచరణ కూడా ఉంది. దాన్ని పోలీసులుక ఇచ్చారు. పోలీసులు కూడా.. పని ప్రారంభించారు. కానీ ఇప్పుడేమైంది..?. తనతో పాటు పోలీసుల్ని, తెలంగాణ ప్రభుత్వాన్ని.. చివరికి జగన్మోహన్ రెడ్డిని కూడా ముంచేస్తున్నారు. ఆరు నెలలు సాధన చేసి.. తనను తాను కొట్టుకున్నట్లుగా ఉంది విజయసాయిరెడ్డి వ్యవహారం.
ఇప్పుడా డాక్యుమెంట్ మాది కాదని చెప్పి తప్పించుకోలేనంత ” మార్వలెస్.. మైండ్ బ్లోయింగ్ ..ఎక్స్ట్రార్డినరి..! .. ప్లాన్‌ను విజయసాయిరెడ్డి అమలు చేశారు. దాన్ని ఈసీ వద్ద రిజిస్టర్ చేసేశారు. ఇక మోడీ దగ్గరకు పరుగులు పెట్టుకుంటూ పోయి.. ప్లీజ్.. ప్లీజ్.. నా గొప్ప తెలివి తేటలతో రూపొందిచుకున్న స్కెచ్ పొరపాటున ఈసీ దగ్గరకు చేరింది. దాన్ని డిలీట్ చేయమడానికి కూడా చాన్స్ లేదు. ఎందుకంటే.. ఆ డాక్యుమెంట్‌ను.. స్కాన్ చేసి.. రిజిస్టర్ చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా.. ఆర్టీఐ చట్టం ప్రకారం దాన్ని తీసుకుంది. కాబట్టి.. ఇప్పుడు ఈసీ కూడా దాన్ని తీసేయడానికి అవకాశం లేకపోయింది.
ఇప్పటికే భారతీయ చట్టంలో…ఎన్ని కుట్రలు, మోసాలు, క్రిమినల్ కేసులున్నాయో.. దాదాపుగా.. అన్నీ కవరయ్యేలా.. జగన్మోహన్ రెడ్డిని… విజయసాయిరెడ్డి ఇరికించేశారు. అప్పట్లో ఆడిటర్‌గా ఉండి.. దొంగ సొత్తను నేరుగా జగన్‌పై పెట్టి ఆయనను జైలు పాలు చేశారు. తనూ జైలు పాలయ్యారు. ఇప్పుడు తనతో పాటు.. తనకు సహకరిస్తున్న కేసీఆర్, కేటీఆర్ వారు చెప్పినట్లు విన్న తెలంగాణ పోలీసులతో పాటు.. మరోసారి జగన్‌ని కూడా బుక్ చేశారు. ఈ వ్యవహారం ఎక్కడి వరకు వెళ్తుందో మరి..!