సార్వత్రిక ఎన్నికల ప్రకటన సాయంత్రం ఐదు గంటలకు వచ్చే అవకాశం ఉంది. ఆదివారం అయినప్పటికీ.. ఎన్నికల సంఘం.. మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీంతో.. ఎన్నికల షెడ్యూల్ ప్రకటనకేనని స్పష్టమవుతోంది. నిజానికి 2014తో పోలిస్తే.. షెడ్యూల్ ప్రకటన ఇప్పటికే ఐదు రోజులు ఆలస్యమయింది. 2014 మార్చి ఐదో తేదీన షెడ్యూల్ ప్రకటించారు. కానీ ఇప్పుడు పదో తేదీ అయినా… ప్రకటించలేదు. ఇలా అయితే.. ఇబ్బందికర పరిస్థితులు వస్తాయన్న ఉద్దేశంతో… సెలవు రోజు అయినప్పటికీ.. ప్రకటన విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.
లోక్‌సభతోపాటు.. నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు కూడా జరగనున్నాయి. ఏపీతో పాటు ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా తొమ్మిది నుంచి పది విడతల్లో ఎన్నికలు జరుగుతాయని అంచనావేస్తున్నారు. ఏపీ తెలంగాణలో ఒకే విడతలో జరుగుతాయని.. అదీ కూడా.. తొలి రెండు, మూడుతల్లోనే పూర్తవుతాయని ఈసీ వర్గాలు చెబుతున్నాయి. బహుశా ఏప్రిల్ లోపు.. పోలింగ్ ముగిసిపోతుదని అంచనా వేస్తున్నారు. తెలంగాణలో ఒక్క లోక్‌సభ ఎన్నికలు మాత్రమే జరగనున్నాయి. ఎన్నికల ప్రకటన రాగాే… కోడ్ అమల్లోకివస్తుంది.
ఆంధ్రప్రదేశ్ రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ ఏర్పాట్లను పూర్తి చేసుకున్నాయి. టీడీపీ అధినేత.. పార్టీకి చెందిన క్యాడర్ మొత్తాన్ని నియోజకవర్గాల వారీగా పిలిచి అందరి అభిప్రాయాలు తీసుకుని అభ్యర్థుల్ని ఖరారు చేశారు. గట్టి పోటీ ఉన్న చోట మాత్రం పెండింగ్ పెట్టారు. ప్రధాన ప్రతిపక్షం జగన్మోహన్ రెడ్డి మాత్రం… అభ్యర్థుల ఎంపికను.. ప్రశాంత్ కిషోర్‌కి అప్పగించారు. జనసేన అధినేత.. వ్యూహం ఏమిటో ఎవరికీ అంతుబట్టకుండా ఉంది. ఒక్కో చోట అభ్యర్థుల్ని ప్రకటిస్తున్నారు… వామపక్షాలతో పొత్తుల విషయంలోనూ క్లారిటీ తెచ్చుకోలేకపోయారు.