రీమేక్ చిత్రాలకు సిద్దహస్తుడు భీమనేని శ్రీనివాసరావు. తను తెరకెక్కించిన చిత్రాల్లో 90 శాతం రీమేక్ కథలే. అల్లరి నరేష్ – సునీల్లలో `సిల్లీ ఫెలోస్` చేశాడు. అదీ రీమేకే. అది ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు మరో రీమేక్ కథని పట్టాలెక్కిస్తున్నాడు. తమిళంలో ఘన విజయం సాధించిన ‘కుట్రమే తందనై పెసరెన్’ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో తీస్తున్నాడు భీమనేని. ఇదో హారర్ కామెడీ సినిమా. ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రధారిగా నటించింది. తెలుగులోనూ తనే కథానాయికగా నటిస్తోంది. కె.ఎస్.రామారావు ఈ చిత్రానికి నిర్మాత. రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, కార్తీక్ రాజ్ ప్రధాన పాత్రలు పోషిస్తారు. ఈనెల 13న రాజమండ్రిలో చిత్రీకరణ ప్రారంభం కానుంది. భీమనేనికి రీమేక్ చిత్రాలు కొత్తకాకపోయినా.. హారర్ కామెడీ మాత్రం కొత్త. మరి ఈ సినిమాని ఎలా డీల్ చేస్తాడో చూడాలి.