గత ఎన్నికల సమయంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి… ఆ తర్వాతనో.. అంతకు ముందునో పార్టీని వీడి.. జగన్ను.. అత్యంత దారుణంగా దూషించిన వారు వరుసగా.. వైసీపీలో చేరుతున్నారు. వీరిలో ముందుగానే పార్టీ ఫిరాయించిన వారుతున్నారు.. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత ఫిరాయించిన వారున్నారు. ఏ కారణం అయినా… జగన్ను అత్యంత దారుణంగా.. ప్రొజెక్ట్ చేసి… పార్టీని వీడిన వారిని.. ఇప్పుడు.. తనకు అంతకు మించిన వారు లేరన్నట్లుగా లాబీయింగ్ చేసుకుని మరీ… పార్టీలోకి ఆహ్వానిస్తూండటం.. అందర్నీ ఆసక్తి కలిగిస్తోంది.
మంత్రి దేవినేని ఉమ సోదరుడు.. దేవినేని చంద్రశేఖర్… 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. జగన్ టిక్కెట్ ఇస్తారేమో అని చూశారు. ఇవ్వలేదు. కానీ… వైసీపీ ఓడిపోయిన తర్వాత.. మళ్లీ సోదరుడికి దగ్గరయ్యారు. దేవినేని ఉమ.. ఎన్నికల్లో తన సోదరుడు వ్యతిరేకంగా పని చేసినప్పటికీ.. ఆయనను దగ్గరకు తీసుకున్నారు. ఆ సమయంలో.. ఆయన జగన్పై తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు.. మళ్లీ.. జగన్ పంచకు చేరారు. జగన్ కూడా ఏమీ మొహమాట పడకుండా పార్టీలోకి ఆహ్వానించారు. ఇది ఒక్కటే కాదు.. జగన్ను అసలు నపుంసకుడిగా అభివర్ణించిన రఘురామకృష్ణంరాజును.. కూడా… లాబీయింగ్ చేయించుకుని మరీ.. పార్టీలో చేర్చుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. నిజానికి రఘురామకృష్ణం రాజు అన్న మాటలకు.. జగన్మోహన్ రెడ్డి ఆయన వస్తానన్నా యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే.. ఆయన చేసింది వ్యక్తిగత విమర్శలు.
ఆ తర్వాత దాడి వీరభద్రరావుది కూడా అదే కోణం. ఆయన వైసీపీకి రాజీనామా చేసినప్పుడు.. జగన్ వ్యక్తిత్వం పై చేసిన ఆరోపణలు అన్నీ ఇన్నీ కాదు. అన్ని మాటలు అన్న దాడి… చాలా కాలం పాటు ఏ పార్టీలోనూ చేరలేదు. టీడీపీలో చేరడానికి ప్రయత్నించారు కానీ.. సాధ్యం కాదు. .. మళ్లీ ఎన్నికల సమయం వచ్చే సరికి.. మళ్లీ వైసీపీ వైపే చూశారు. వైసీపీ నేతలే ప్రత్యేకంగా.. దాడి కోసం రాయబారం చేసి మరీ పార్టీ లో చేర్చుకున్నారు. ఒకప్పుడు.. ఇలా తనను విమర్శించిన వారిని.. జగన్ పిలిచి మరీ పార్టీలో చేర్చుకోవడంతో.. ఆయనకు… ఇంతకు మించిన నేతలు లేరన్న భావన పార్టీలో ఏర్పడిపోయింది. వారి చేరికల వల్ల.. జగన్కు లాభం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుందన్న విశ్లేషణ రాజకీయవర్గాల్లో ఉంటోంది.