డేటా చోరీ కేసులో ఐటీ గ్రిడ్ ఎండీ అశోక్ క్వాష్ పిటిషన్లపై హైకోర్టులో జరిగిన విచారణ జరిగింది. అశోక్‌ను 20వ తేదీ వరకు అరెస్టు చేయబోమని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపినట్లు సమాచారం. దీనిపై స్పందించిన అశోక్ తరపు న్యాయవాది లిఖితపూర్వకంగా ఇవ్వమని కోర్టును అభ్యర్థించారు. అయితే అశోక్ విచారణకు సహకరించాలని తెలంగాణ ప్రభుత్వ న్యాయవాది కోరారు. దీనిపై.. పోలీసులు ఇచ్చిన నోటీసులకు.. అశోక్ సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. తదుపరి వాయిదాను ఇరవయ్యో తేదీకి వాయిదా వేశారు. రాజకీయ కుట్రలో భాగంగానే తనపై, కంపెనీపై కేసు పెట్టారని, ఆ కేసులను తొలగించాలని హైకోర్టులో అశోక్ పిటిషన్ వేశారు.
అశోక్ ప్రస్తుతం ఆజ్ఞాతంలో ఉన్నారు. ఆయన తన కంపెనీలో పోలీసులు డేటా చోరీ చేశారని ఆరోపిస్తున్నారు. తన కంపెనీలో ఎలాంటి డేటా దుర్వినియోగం చేయలేదని.. రాజకీయ కక్షతోనే కేసులు పెట్టారని పిటిషన్ వేశారు. ఈ సమయంలో.. విజయసాయిరెడ్డి … చేసిన ప్లాన్ అంతా .. టీడీపీ అధినేత చంద్రబాబు బయటపెట్టారు. పోలీసులు ఓ రాజకీయ కుట్ర ప్రకారం చేస్తున్నారని… తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి ఈసికి ఇచ్చిన ఫిర్యాదులో తెలంగాణ పోలీసులు చేయాల్సిన పనుల యాక్షన్ ప్లాన్ కూడా పెట్టి ఇవ్వడంతో దొరికిపోయినట్లయింది. అలాగే పోలీసులు కేసు నమోదు చేసింది మార్చి రెండో తేదీ అయితే.. 23వ తేదీనే సోదాలు చేసి.. డేటా తీసుకెళ్లారని అశోక్ ఆరోపిస్తున్నారు. తర్వాతి విచారణలో.. ఈ అంశాలన్నీ బయటకు వచ్చే అవకాశం ఉంది.
మరో వైపు డేటా టోరీ అంశంపై.. టీడీపీ చేసిన ఫిర్యాదుపై.. సిట్ గుట్టుగా విచారణ జరుపుతోంది. విజయసాయిరెడ్డి రాసిన లేఖతో పాటు.. 23వ తేదీన పోలీసులు దాడి చేసి.. డాటా డౌన్ లోడ్ చేసిన ఆధారాలతో పాటు… పోలీసులు సోదాలు చేసిన సీసీ టీవీ ఫుటేజీని సేకరించారు. అలాగే.. సిట్ ముందుకు.. అశోక్ వస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయన పోలీసులు బెదిరించిన ఆడియోలు, ఇతర ఆధారాలు ఇస్తారని చెబుతున్నారు. దీంతో కేసు కొత్త మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ సిట్ ఈ విషయంలో… ఎలాంటి లీకులు బయటకు రాకుండా జాగ్రత్త పడుతోంది.