భారతీయ జనతా పార్టీ 2014 ఎన్నికల్లో చారిత్రక విజయం సాధించింది. కాంగ్రెసేతర జాతీయ పార్టీగా.. తొలి సారి.. పూర్తి మెజార్టీ సాధించింది.. ఓ కొత్త చరిత్ర సృష్టించిందనే చెప్పాలి. రాజీవ్ గాంధీ హత్యానంతరం దేశవ్యాప్తంగా వచ్చిన సానుభూతి పవనాల్లో.. కాంగ్రెస్ పార్టీ 300కిపైగా సీట్లను సాధించింది. ఆ తర్వాత ఎవరికీ సాధ్యం కాలేదు. మూడు దశాబ్దాల తర్వాత తొలి సారి బీజేపీ ఆ ఘనత సాధించింది. ఓ రకంగా… గత ఎన్నికల్లో బీజేపీ వేవ్ కనిపించింది.
ఇంతింతై అన్నట్లు 2017 వరకూ ఎదిగిన బీజేపీ, మోడీ..!
దేశంలో ఓ సుస్థిరమైన సంకీర్ణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. బీజేపీకి సొంతంగా మెజార్టీ వచ్చినప్పటికీ.. మిత్రులతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్నే ఏర్పాటు చేశారు. జాతీయ పార్టీలు కనుమరుగు అవుతున్నాయనే వాతావరణం ఏర్పడిన దశలో.. బీజేపీ ఈ విజయాన్ని సాధించి పరిస్థితిని మార్చింది. 2014 తర్వాత బీజేపీ.. మరింత బలపడింది. ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో తిరుగులేని విజయాలు నమోదు చేసింది. బీజేపీ సొంతంగా కానీ.. మిత్రులతో కలిసి కానీ… భారత్‌లో ఉన్న 29 రాష్ట్రాల్లో… 20కిపైగా రాష్ట్రాల్లో అధికారాన్ని సాధించింది. కాంగ్రెస్ పార్టీ చాలా రాష్ట్రాల్లో కనురమరుగు అయిపోయింది. 2017 వరకూ.. బీజేపీ కొనసాగించింది. కానీ.. ఆ తర్వాత పరిస్థితి మారిపోయింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్ ఎన్నికల్లో బీజేపీ పరాజయం పాలైంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసింది. అరవై ఐదు లోక్‌సభ స్థానాలున్న ఈ రాష్ట్రాల్లో గత ఎన్నికల్లో బీజేపీ 62 గెలుచుకుంది. కానీ.. ఈ మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. కాంగ్రెస్ ముక్త్ భారత్ అని నినాదం ఇచ్చింది… అయితే కాంగ్రెస్ మాత్రం… ప్రజల మద్దతు కూడగట్టుకుంటోంది. మూడు రాష్ట్రాల్లో అధికారం సాధించింది. అదే సమయంలో… కర్ణాటకలో కాస్త తగ్గి అయినా… అధికారాన్ని మిత్రులతో పంచుకుంటోంది. అంటే… బీజేపీ, మోడీ హవా… 2014లో ఉద్ధృతంగా ప్రారంభమై.. 2017కి.. ఓ రేంజ్‌కు చేరి… 2019 కల్లా బాగా డౌన్ అయిందని అర్థం చేసుకోవచ్చు.
లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల్లో వరుస పరాజయాలు..!
భారతీయ జనతా పార్టీ.. బలహీన పడినట్లు కనిపిస్తున్నప్పటికీ.. చాలా రాష్ట్రాల్లో బలమైన ఓటింగ్ కలిగి ఉంది. ఉత్తరప్రదేశ్‌లో ఆ పార్టీకి నలభై శాతం ఓటింగ్ ఉంటుందని విశ్లేషించవచ్చు. ఇంకో ముఖ్యమైన విషయం ఏమింటే.. ఇప్పుడు.. దేశంలో రెండు ప్రధాన రాజకీయ కూటములు ఉన్నాయి. ఒకటి బీజేపీ నేతృత్వంలో.. మరొకటి కాంగ్రెస్ నేతృత్వంలో. కాంగ్రెస్ పార్టీ చరిత్రలో… గత ఎన్నికల్లో ఘోరమైన పరాజయం పొందింది. 2014లో కాంగ్రెస్ కేవలం 44 పార్లమెంట్ సీట్లను సాధించింది. ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. పదేళ్ల పాటు అధికారం అనుభవించిన తర్వాత ఇది ఘోర పరాజయం. బీజేపీ మోడీ నేతృత్వంలో సంపూర్ణ మెజార్టీ సాధించిందింది. ఏ విధంగా చూసినా అది నిర్ణయాత్మకమైన విజయం. అయితే.. ఆ తర్వాత.. దేశంలో 30 లోక్‌సభ స్థానాలకు ఉపఎన్నికలు జరిగాయి. ప్రతి ఉపఎన్నికలోనూ బీజేపీకి నిరాశజనక ఫలితాలు వచ్చాయి. 2014లో గెలిచిన సీట్లలో 9 సీట్లను కోల్పోయింది. బీజేపీ ఉపఎన్నికల్లో ఓడిపోవడం అనేది.. కీలకమైన పరిణామం. బీజేపీకి.. ఇప్పుడు సొంతంగా మెజార్టీ లేని పరిస్థితి వచ్చింది. ఒకరిద్దరు ఎంపీలు ఇతర పార్టీల్లో చేరారు. 2014లో.. సొంతంగా మెజార్టీ తెచ్చుకున్న బీజేపీ.. ఐదేళ్ల తర్వాత ఇప్పుడు.. పూర్తి గా బలం లేని స్థితికి చేరిపోయింది.
పుంజుకున్న కాంగ్రెస్ – బలహీనపడిన బీజేపీ ..!
కూటముల పరంగా చూసినా.. బీజేపీ నేతృత్వంలోని కూటమి బలహీనపడింది. కూటమి నుంచి కొన్ని పార్టీలు వెళ్లిపోయాయి. టీడీపీ వెళ్లిపోయింది. ఆర్ఎల్ఎస్పీ వెళ్లిపోయింది. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీలో కొన్ని పార్టీలు చేరకపోయినా… ఆ పార్టీతో సన్నిహితంగా ఉంటుంది. బీజేపీ కూటమిలోకి వచ్చిన ప్రధాన పార్టీ అన్నాడీఎంకే. అన్నాడీఎంకేకు 37 సీట్లు ఉండటంతో.. సంఖ్యల్లో ఎన్డీఏ బలం పెరిగింది. కానీ… బీజేపీ బలం తగ్గింది. భారత రాజకీయాల్లో బీజేపీ ఆధిక్యత కలిగిన పార్టీగా… మోడీ.. ఆధిక్యత కలిగిన నేతగా ఉన్నారు. అయితే ఈ ఆధిక్యత.. తగ్గుతూ వస్తుందన్నది మాత్రం నిజం. 2014లో ఉన్న మోడీ… 2019లో ఉన్న మోడీ కాదు. 2014లో ఉన్న ఎన్డీఏ… 2014లో ఎన్డీఏ కాదు. కచ్చితంగా.. అప్పటితో పోలిస్తే.. ఇప్పుడు బలహీన బీజేపీ, బలహీన మోడీ, బలహీన ఎన్డీఏ ఎన్నికల్లో పోటీ పడబోతోంది.