” ఆంధ్రా పెత్తనం మనకు అవసరమా” అనేది.. మూడు నెలల కిందట జరిగిన తెలంగాణ ఎన్నికల్లో.. కేసీఆర్ ప్రధాన ప్రచార స్లోగన్. బంగారు తెలంగాణ దిశగా ఆయనేం చేశారో చెప్పుకోలేదు…కానీ… చంద్రబాబును మాత్రం ఆంధ్రాబాబుగా చేసి అందరి మనుసుల్లో విషం నింపడానికి ప్రయత్నించారు. చివరికి విజయం సాధించారు. ఇప్పుడు.. అలా అన్న ఆయనే.. ఏపీపై పెత్తకానికి… తన పోలీసుల్ని సైతం.. జగన్కు అప్పగించేసి… తెర వెనుక రాజకీయం చేస్తున్నారు.
కేసీఆర్ రిటర్న్ గిఫ్టుల్లో దొరతనం ఎందుకు మిస్సయింది..?
కేసీఆర్ రిటర్న్ గిఫ్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో హాట్ టాపిక్. విజయవాడ నడిబొడ్డున చంద్రబాబు గురించి చెబుతానని కేసీఆర్ గొప్పగా ప్రకటించారు. జగన్తో కేటీఆర్ ఫెడరల్ ఫ్రంట్ చర్చలు జరిపారు. దాంతో తెలంగాణకు వెళ్లి చంద్రబాబు ప్రచారం చేసినట్లుగా.. కేసీఆర్ కూడా.. జగన్ కోసం.. దొరతనంగా ప్రచారం చేస్తారేమోనని ఊహించారు. కానీ అనూహ్యంగా.. రిటర్న్ గిఫ్ట్లన్నీ… దొరతనం లేకుండా.. మరో రూపంలో… పంపుతున్నారు. అందులో మొదటిది ఆస్తులు, వ్యాపారాలున్న నేతల్ని.. వైసీపీలో చేర్పించడం. చివరికి జయసుధను కూడా బెదిరించారంటే.. వైసీపీ కోసం టీఆర్ఎస్ ఎంత ఆరాటపడుతుందో అర్థం అవుతుంది. ఒకప్పుడు జగన్ వ్యక్తిగత వ్యవహారశైలిని విమర్శించిన వారు ఇప్పుడు బలవంతపు నవ్వులతో.. కండువా కప్పించుకుంటున్న దృశ్యాలు కనిపిస్తున్నారంటే.. దాని వెనుక రాజకీయం లేకుండా ఎందుకు ఉంటుంది. ఇప్పుడు విజయసాయిరెడ్డి డైరక్షన్లో డేటా చోరీ అంటూ.. తెలంగాణ పోలీసులు ప్రారంభించారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్ కూడా బయటకు వచ్చింది. ఎన్నికల్లో డబ్బులు పంచేందుకు … కేసీఆర్ రెండు వేల కోట్ల రూపాయలను జగన్కు ఇచ్చారని… విస్తృతంగా ప్రచారం జరుగుతోంది.
ఏపీపై తెలంగాణ నేతలకు చులకన భావం ఎందుకొచ్చింది..?
గత రెండు, మూడు నెలలుగా జరుగుతున్న రాజకీయం చూస్తే.. ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత పోరాటం కన్నా… టీడీపీపై ఎక్కువగా.. టీఆర్ఎస్సే ఎటాక్ చేస్తోంది. తలసాని లాంటి వాళ్లను ఏపీపైకి ప్రయోగించారు. టీడీపీ సేవామిత్ర యాప్ను టార్గెట్ చేశారు. ఈ అంశాలను… జగన్ .. రాజకీయ అస్త్రాలుగా వాడుకుంటున్నారు. మొత్తానికి జగన్ కు.. ఎజెండాను కేసీఆర్ సెట్ చేస్తున్నారన్నది మాత్రం క్లారిటీగా తెలిసిపోతుంది. కారణం ఏమైనా.. తెలంగాణ ఎన్నికల సమయంలో… ఏపీలో ఎక్కువగా…ప్రజాకూటమి గెలవాలని కోరుకున్నారు. చాలా కొద్ది మంది మాత్రమే.. టీఆర్ఎస్కు మద్దతిచ్చారు. దానికి ఆ సమయంలో టీఆర్ఎస్ కు వైసీపీకి సహకరించడం లాంటి కారణాలున్నాయి. టీడీపీపై వ్యతిరేకతతో.. తెలంగాణలో ఉంటున్న ఆంధ్ర ఓటర్లలో కులపరమైన విభజన తెచ్చి.. టీఆర్ఎస్కు సహకరించారు. దాంతో.. ఏపీపై… తెలంగాణ నాయకులకు.., ఓ రకమైన చులకన భావం ఏర్పడింది.
జగన్ వస్తే కేసీఆర్ పోర్టుల్ని స్వాధీనం చేసుకుంటారా..?
ఏపీ ప్రజలంతా .. టీఆర్ఎస్.. ఏపీపై పెత్తనానికి వస్తుందన్న భావనలో ఉన్నారు. తెలంగాణ రాజకీయాల్ని దగ్గరగా ఫాలోఅయిన వారు.. కేసీఆర్ ప్రచార శైలి చూసిన వారు.. మాత్రం.. ఇప్పుడు… పూర్తిగా కేసీఆర్.. తమపై పెత్తనానికి వస్తున్నారనే అభిప్రాయానికి వస్తున్నట్లు రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే సమయంలో.. తమకు అధికారం లేకపోయినప్పటికీ.. ఏపీపై పెత్తనం తీసుకునేందుకు పోలీసుల్ని ఉపయోగించుకుంటున్నారనే అభిప్రాయం.. గట్టిగా ప్రజల్లోకి వెళ్తోంది. తమను బూచిగా చూపి ఎన్నికల్లో గెలిచిన వారిని…వారికి మద్దతిస్తున్న వారిని తాము ఎలా ఆదరించగమని.. ప్రజలు భావిస్తున్నారు. వైసీపీకి ..కేసీఆర్ పెట్టుబడులు పెడుతున్నారని.. అందుకు ప్రతిఫలంగా వాన్ పిక్ పోర్టును స్వాధీనం చేసుకుంటారని.. అలా అయితే.. ఇక ఏపీ తెలంగాణకు సామంతరాజ్యంగా పడి ఉండాలన్న … అభిప్రాయం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది. కేసీఆర్కు సామంతులుగా ఉండటానికి ఏపీ ప్రజలు సిద్ధంగా లేరు.