వంగవీటి రాధాకృష్ణ.. తెలుగుదేశం పార్టీ అధినేతతో భేటీ అయ్యారు. దాదాపుగా గంటన్నర సేపు చర్చలు జరిపారు. బుధవారం ఆయన టీడీపీలో చేరుతారు. పోటీ విషయంలో మాత్రం.. నిర్ణయాన్ని చంద్రబాబుకు వదిలేశారు. “వదిలేస్తే గాలికి కొట్టుకుపోతావని..” జగన్ అవమానించడంతో… వంగవీటి రాధాకృష్ణ.. వైసీపీకి రాజీనామా చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటమే ధ్యేయంగా పని చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆయనను టీడీపీలోకి తీసుకు రావాలని.. ఆ పార్టీ నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. నేరుగా ఆయన ఇంటికి వెళ్లి ఆహ్వానించారు కూడా. అయితే.. ఆయనకు ఎమ్మెల్సీ ఇస్తామని… టీడీపీ ఆఫర్ ఇచ్చింది. అయితే.. అప్పుడు ఆయన నిర్ణయం తీసుకోలేదు.
ఆయనను టీడీపీలో చేర్చే బాధ్యతను లగడపాటి రాజగోపాల్ తీసుకున్నారు. ఐదు జుల కిందట.. లగడపాటి… వంగవీటితో సమావేశమయ్యారు. టీడీపీలో చేరి ఫలానా సీటు నుంచి పోటీ చేస్తే మంచి ఫలితం ఉంటుందని.. సర్వే నివేదికలు ఇచ్చి సర్ది చెప్పినట్లు తెలుస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వస్తున్న సమయంలో… వేగంగా నిర్ణయం తీసుకోకపోతే.. ఈ ఎన్నికలను మిస్ కావాల్సి వస్తుందని… వంగవీటి రాధా అభిమానులు కూడా.. ఆందోళన చెందుతున్నారు. జనసేన పార్టీ రేసులో ఉందని.. ఎవరూ అనుకోవడం లేదు. దాంతో.. ఆ పార్టీ వైపు ఎవరూ చూడటం లేదు. టీడీపీలో చేరితేనే… భవిష్యత్ ఉంటుందని అంటున్నారు. రాధా-రంగా మిత్రమండలి కూడా గతంలోనే టీడీపీలో చేరేందుకు తమ మద్దతు తెలిపింది.
ప్రస్తుతం.. మచిలీపట్నం .. .ఎంపీ కొనకళ్ల నారాయణ.. పెడన నుంచి అసెంబ్లీకి పోటీ చేయాలన్న ఆసక్తితో ఉన్నారు. పెడన ప్రస్తుత ఎమ్మెల్యే కాగిత వెంకట్రావు అనారోగ్యంతో ఉన్నారు. మచిలీపట్నం టిక్కెట్ కొనకళ్లకు కేటాయిస్తే.. ఆ టిక్కెట్ ను.. వంగవీటి రాధాకు కేటాయించే అవకాశం ఉంది. అక్కడ సహజంగానే కాపు నాయకులకు … అన్ని పార్టీలు టిక్కెట్ కేటాయిస్తూంటాయి. ఇప్పటికైతే.. వంగవీటి పార్టీలో చేరడం ఖాయమయింది. పోటీపై మాత్రం చంద్రబాబు రెండు రోజుల్లో నిర్ణయం తీసుకోనున్నారు.