పార్లమెంట్ సీట్లలో బలమైన అభ్యర్థులను నిలబెట్టాలనుకుంటున్న తెలుగుదేశం పార్టీ అధిష్టానం.. కొంత మంది మంత్రులపై దృష్టి సారించింది. గంటా శ్రీనివాసరావు, సిద్ధా రాఘవరావులను.. ఎంపీలుగా పోటీ చేయాలని హైకమాండ్ కోరుతోంది. వారు ఎంపీలుగా వెళ్తేనే.. సమీకరణాలు కలసి వస్తాయని చెబుతున్నాయి. మంత్రి గంటా ను అనకాపల్లి అసెంబ్లీ నుంచి కానీ.. విశాఖ ఎంపీ గా పోటీ చేయించే ఆలోచన లో అధిష్టానం ఉంది. విశాఖ ఎంపీగా.. కాపు సామాజికవర్గానికి చెంది నేతను నిలబెట్టాలని.. డిసైడయ్యారు. ఈ మేరకు గంటాను ఒప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు. గంటా కూడా.. ప్రత్యామ్నాయం లేకపోతే పోటీ చేస్తానని చెబుతున్నారు. ఇక ప్రకాశం జిల్లా మంత్రి సిద్దా రాఘవరావును కూడా ఒంగోలు ఎంపీగా పోటీ చేయమని కోరుతున్నారు. ఆయన సుముఖంగానే ఉన్నా… ఆయన కుటుంబీకులు, దర్శి టీడీపీ నేతలు మాత్రం… ఆయన అసెంబ్లీకే పోటీ చేయాలని కోరుతున్నారు.
దీంతో.. దర్శి టిక్కెట్ తన కుటుంబానికే ఇవ్వాలని ఆయన టీడీపీ అధినేత వద్ద ప్రతిపాదన పెట్టారు. వీరిద్దరికే కాదు.. మరికొంత మంది మంత్రులకూ.. తిప్పలు తప్పడం లేదు. ఇప్పటికే మంత్రి ఆది నారాయణరెడ్డిని కడప బరిలోకి దించారు. ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. జమ్మలమడుగు.. అసెంబ్లీ నియోజకవర్గాన్ని తన చిరకాల ప్రత్యర్థికి అప్పగించేసి.. తాను ఎంపీగా పోటీ చేస్తున్నారు. మరో మంత్రి జవహర్ కూ అసంతృప్తి ఎక్కువగా ఉంది. కొవ్వూరు నియోజకవర్గంలో.. ఆయనకు మళ్లీ టిక్కెట్ ఇవ్వవద్దని.. సగం క్యాడర్ నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తోంది. ఆయన ఉద్యోగరీత్యా కొవ్వూరులో స్థిరపడినా… ఆయన సొంత నియోజకవర్గం కృష్ణా జిల్లా తిరువూరు. అందుకే.. అక్కడ జవహర్‌కు సర్దుబాటు చేయాలని చంద్రబాబు భావిస్తున్నారు. చివరికి మంత్రి కాల్వ శ్రీనివాసులకూ చిక్కులు తప్పడం లేదు.
కాల్వ కు సీటు ఇవ్వొద్దంటూ ఎమ్యెల్సీ దీపక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మెట్టు గోవింద రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు అంగీకరించకపోవడంతో… మెట్టు గోవిందరెడ్డి వైసీపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అయితే.. ప్రతిగా.. రాయదుర్గం మాజీ ఎమ్మెల్యే.. పాటిల్ వేణుగోపాల్ రెడ్డిని కాల్వ.. టీడీపీకి రప్పిస్తున్నారు. మంత్రులందరికీ… ఇబ్బందులున్నా.. చంద్రబాబు పోటీకి దింపుతున్నారు. టిక్కెట్ రాదని ప్రచారం జరిగిన… ఒకే ఒక్క మంత్రి రావెల కిషోర్ ను ముందుగానే మంత్రి పదవి నుంచి తప్పించడంతో.. మంత్రులకు టిక్కెట్ నిరాకరించే పరిస్థితి రాలేదు.