ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలమైన నేతల కోసం..మైండ్‌గేమ్‌ను నమ్ముకుంది. ఓ ప్రత్యేకమైన నెట్‌వర్క్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ నడుపుతోంది. జగన్ ప్రవర్తన కారణంగానో… వైసీపీపై ఆశలు లేని కారణంగానో.. ఆ పార్టీ నుంచి బలమైన నేతలంతా… గత నాలుగేళ్ల కాలంలో దూరం జరిగిపోయారు. సీనియర్లు కొంత మంది ఉన్నా.. జగన్ వారిని పరిగణనలోకి తీసుకోరు. ఎన్నికల సమయంలో.. పోటీలకు సీనియర్లు, సమర్థులు, ప్రజాబలం ఉన్న వారు కావాలి కాబట్టి… బీహార్‌కు చెందిన కన్సల్టెంట్ ప్రశాంత్ కిషోర్‌ను పెట్టుకుని మైండ్‌గేమ్ ద్వారా.. నేతల్ని తన పార్టీలోకి ఆహ్వానించాలని.. జగన్ ప్లాన్ చేశారు.
తెలుగుదేశం పార్టీలో ఉన్న బలమైన నేతలందరిపైనా.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ.. మైండ్ గేమ్ ఆడుతోంది. పీకే టీం సర్వేల పేరుతో.. గంటా, పితాని లాంటి వాళ్లను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసి.. పార్టీలోకి లాగేందుకు ప్రయత్నిస్తోంది. వారు వైసీపీలోకి వస్తారంటూ.. ముందుగా సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. ఇలా ప్రచారం చేయడానికి ప్రధాన కారణం… వారిపై.. టీడీపీ హైకమాండ్ అనుమానపడేలా చేయడం. అలా జరిగినట్లు సూచనలు వస్తే.. వెంటనే… వైసీపీ నుంచి కొంత మంది పెద్దలు రంగంలోకి దిగుతారు. జగన్ మీడియా దీనికి మరింత ఆజ్యం పోస్తుంది. ఆ గ్యాప్‌ను మరింత పెంచుతూ.. చివరికి.. వాళ్లు టీడీపీలో ఉండకుండా చేసి… తప్పని పరిస్థితి తమ పార్టీలో చేసుకోవడం ఆ వ్యూహం అంటున్నారు. ఇలా రఘురామకృష్ణం రాజు నుంచి పలువురు నేతలపై ఈ మైండ్ గేమ్ ఆడారు. ఒకటీ అరా తప్ప.. పెద్దగా సక్సెస్ కాలేదు. పీకే టీం ఈ విషయంలో.. టీడీపీకి చెందిన చాలా మంది ముఖ్య నేతల్ని గుర్తించింది. వారిపై మైండ్ గేమ్ ఆడింది. కానీ.. వారి గేమ్‌కి దొరికింది.. చాలా పరిమితమైన నేతలే. వారు కూడా.. టిక్కెట్లు గ్యారంటీ లేదని ఖరారైన తర్వాతనే వైసీపీ వైపు చూశారు. ప్రత్యేకంగా ప్లాన్ ప్రకారం… వైసీపీ మైండ్ గేమ్‌ను విస్తృతంగా ప్రయోగిస్తోంది.
జగన్ ప్రవర్తన వల్ల.. కొంత మంది రాజకీయాల నుంచి వైదొలగడానికి కూడా సిద్ధపడుతున్నారు కానీ.. వైసీపీలో చేరడానికి సముఖంగా ఉండటం లేదు. మరో వైపు… టీడీపీ కీలక నేతలపై.. ఇలాంటి మైండ్‌గేమ్ ఆడి వారిని పార్టీలోకి తీసుకొచ్చేందుకు పడుతున్న తంటాలు చూసి.. చాలా మంది నవ్వుకుంటున్నారు. గంటా .. జగన్మోహన్ రెడ్డిని కలిశారని… సాక్షిలో బ్రేకింగులు వేస్తున్న సమయంలోనే… ఆ సాక్షి స్క్రీ న్ షాట్‌తో .. లోకేష్, గంటా కలిసి సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో పెట్టారు. దాంతో.. వైసీపీ తీరు నవ్వుల పాలయింది. పితాని కూడా.. సిగ్గులేకుండా వ్యవహరిస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. అయినా… సరైన అభ్యర్థులు లేకపోవడంతో..వారి కోసం వైసీపీకి మైండ్ గేమ్ తప్ప..మరో దారి కనిపించడం లేదు.