వైఎస్ వివేకానందరెడ్డిది హత్యేనని… కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ స్పష్టంగా ప్రకటించారు. పోస్ట్ మార్టం ముగిసిన తర్వాత ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు. తలపై మూడు, ఒంటిపై రెండు గాయాలున్నాయన్నాయన్నారు. మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. వివేకానందరెడ్డి ఇంట్లో డాగ్ స్క్వాడ్ తనిఖీలు నిర్వహించింది. వివేకా ఇంటి ఆవరణలో తిరిగి లోపలికి వెళ్లింది జాగిలం. ఈ కేసు విచారణకు.. సీనియర్ ఐపీఎస్ అధికారి అమిత్ గార్గ్ నేతృత్వంలో.. ప్రత్యేక విచారణ బృందాన్ని నియమించారు. ఐపీసీ సెక్షన్ 302 కింద కేసు నమోదు చేశారు. కేసులో కొన్ని కీలకమైన క్లూలు లభించాయని… పోలీసులు తెలిపారు. ఫోరెన్సిక్ నిపుణులను రంగంలోకి దించారు.
కమలాపురం ఎమ్మెల్యే రవీంధ్రనాథ్ రెడ్డి… టీడీపీ నేతలపై ఆరోపణలు చేయడం.. వివాదాస్పదంగా మారింది. ఆదినారాయణ రెడ్డి, చంద్రబాబు, లోకేష్ పై అనుమానాలున్నాయని ఆయన ఆరోపించారు. రవీంధ్రనాథ్ రెడ్డి.. జగన్ కు మేనమామ కూడా. దీనిపై మంత్రి ఆదినారాయణరెడ్డి వెంటనే స్పందించారు.
తమపై ఆరోపణలు చేయడాన్ని ఖండించారు. వై ఎస్ వివేకా కు అవినాష్ రెడ్డికి సీట్ గొడవ ఉందని… ఈ కోణంలో ఏమైనా జరిగిందో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు.
గతం లో కోడికత్తి కేస్ లోనూ ఆరోపణలు చేశారన్నారు. వివేకా మృతిపై అనుమానం ఉందని తాము కూడా దర్యాప్తు కోరుతున్నామన్నారు. దర్యాప్తు లోతుగా ఉండాలి తప్పు ఉంటే వారికి ఉరిశిక్ష వేయాలన్నారు.
ముందుగా గుండె పోటు అన్నారని.. ..ఆ తర్వాత అనుమానం అన్నారని విమర్శించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీటెక్ రవి చేతిలో ఓటమి చవి చూశారురు వైఎస్ వివేకానంద రెడ్డి. అప్పట్నుంచి వైఎస్ వివేకానంద రెడ్డి, అవినాష్ రెడ్డి ల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయన్నారు. నేరారోపణలు చేశారు కాబట్టి ఏమి జరిగిందో రుజువు చేయాలిని డిమాండ్ చేశారు.
కడప ఎంపీగా పోటీ చేసే విషయంలో జగన్మోహన్ రెడ్డి కి వివేకానంద రెడ్డి కి మధ్య గతంలో విభేదాలు వచ్చాయిన్నారు. తమపై ఆరోపణల్ని ఖండించారు. అయితే… ఇతరులెవరు.. ఈ ఆరోపణలు చేయలేదు. ఏం జరిగిందో మొత్తం బయటకు తీస్తామని పోలీసులు చెబుతున్నారు.