ఆర్ఎక్స్ 100 సినిమాతో సర్రున దూసుకువచ్చాడు దర్శకుడు అజయ్ భూపతి. అయితే ఆ స్పీడు కు తగినంతగా తరువాత సినిమా సెట్ మీదకు వెళ్లడం లేదు. ప్రతిసారీ ఏదో బ్రేక్ పడుతోంది. ఆర్ఎక్స్ 100 తరువాత రెండు మూడు సంస్థలు అజయ్ భూపతితో సినిమా చేయడానికి ఆసక్తిగా ముందుకు వచ్చాయి.
ఇలా వచ్చిన వాటిల్లో భవ్య మూవీస్, హీరో రామ్, హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తదితర పేర్లు వినిపించాయి. ఆ తరువాత ఏమయిందో రామ్ ప్రాజెక్టు గురించి వినిపించలేదు. బెల్లంకొండ హీరోగా ప్రాజెక్టు వుంటుందని మాత్రం వినిపించింది.
కానీ ఈలోగా బెల్లంకొండ కూడా రమేష్ వర్మ, మరో కొత్త డైరక్టర్ ఇలా వేరే ప్రాజెక్టుల మీదకు వెళ్లిపోయాడు. విశ్వసనీయ వర్గాల బోగట్టా ఏమిటంటే, అజయ్ భూపతి తో బెల్లంకొండ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయిందని. అంటే ప్రస్తుతం అజయ్ భూపతి ఖాళీ. డైరక్టర్ల కోసం వెదుకుతున్న హీరోలు ఎవరైనా వుంటే ఆనందంగా ప్రాజెక్టు చేసుకోవచ్చు అన్నమాట.
ఆర్ఎక్స్ 100 తో మంచి సినిమా కొట్టినా, అజయ్ భూపతితో ఎందుకు సినిమాలు సెట్ కావడం లేదో? హీరోలకు? ఎక్కడుందో తేడా?