వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థుల విషయంలో.. చాలా విచిత్రాలు చోటు చేసుకున్నాయి. సామాన్యులంటూ.. ముగ్గురు, నలుగుర్ని.. హైలెట్ చేస్తున్నారు. నిజానికి వారి బ్యాక్‌గ్రౌండ్ సామాన్యమైనదేమీ కాదని… జగన్ ఆశించిన స్థాయిలోనే ఉందని.. టీడీపీ వర్గాలు చెబుతున్నారు. జగన్ సామాన్యుల జాబితాలో వేసిన ఎంపీ అభ్యర్థి నందిగం సురేష్. ఈయనెవరో.. ఎవరికీ తెలియదు. అందుకే… సామాన్యుడని అందరూ అనుకుంటున్నారు. మరి ఇంత సామాన్యుడిని జగన్ ఎలా.. కనిపెట్టారు..? ఏం చూసి టిక్కెట్ ఇచ్చారు..? ఇవన్నీ.. మిస్టరీ ప్రశ్నలే. కానీ ఇప్పుడిప్పుడే అవన్నీ వీడిపోతున్నాయి.
ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతిని రాజధానిగా నిర్ణయించిన తర్వాత అక్కడి రైతులు.. స్వచ్చందంగా భూములు ఇచ్చారు. ఆ ప్రాసెస్‌లో వారిని రెచ్చగొట్టడానికి, భయపెట్టడానికి చాలా కార్యక్రమాలు జరిగాయి. అందులో కొన్ని పంటలు తగుల బెట్టడం లాంటి చిల్లర నేరాలు కూడా ఉన్నాయి. హఠాత్తుగా ఓ అర్థరాత్రి అరటి తోట తగలబడిపోతుంది. ఎవరు చేశారో.. ఆ చుట్టుపక్కల అందరికీ తెలిసిపోతుంది. కానీ పోలీసుల దగ్గర ఆధారాలు ఉండవు. అలాంటి నేరాలు చేసి.. రైతుల్లో భయాందోళనలు కల్పించడానికి… కర్త, కర్మ, క్రియగా పని చేసిన వ్యక్తి ఈ నందిగం సురేష్. పోలీసు రికార్డుల్లోనూ ఈ పేరు ఉంది. రాజధాని గ్రామం అయిన ఉద్దండరాయుని పాలెం గ్రామవాసినే ఈ నందిగం సురేష్. తన రాజధాని అభిప్రాయాలకు తగినట్లుగా.. నందిగం సురేష్ వ్యవహారించడంతో..జగన్ మెచ్చి టిక్కెట్ ఇచ్చారని చెబుతున్నారు.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా.. దాదాపుగా.. ఒకే తరహాగా ఉంటున్నారు. వారి బ్యాక్‌గ్రౌండ్ అంతా.. వివాదాస్పదంగా ఉంటోంది. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి.. ప్రొత్సహిస్తున్న వారి తీరు… అంతే వివాదాస్పదంగా ఉంటుంది. అది వైసీపీ ఇమేజ్‌కు దగ్గరగా ఉంటోంది. సాధారణంగా ఎంపీ అభ్యర్థులను కాస్త విద్యావంతులు, ఎలాంటి నేరారోపణలను ఎంపిక చేస్తారు. ఎందుకంటే్… పార్లమెంట్లో మాట్లాడాల్సి వస్తే.. ఇబ్బందిలేకుండా ఉంటుందని…! కానీ జగన్మోహన్ రెడ్డి శైలి మాత్రం భిన్నం..!