భీమవరం నుంచి వవన్ కల్యాణ్ పోటీ చేస్తున్నాడని తెలియగానే.. అక్కడ పవన్ ఈజీగా గెలుస్తాడన్న అంచనాకు వచ్చేశారంతా. కానీ తీరిగ్గా ఆలోచిస్తే.. పవన్ కి ఇక్కడ గెలుపు అంత ఈజీ కాదు. ఎందుకంటే భీమవరంలో కాపులతో పాటు రాజుల ప్రాబల్యం చాలా ఎక్కువ. దాదాపు 50 వేల ఓటు బ్యాంకు రాజులకు ఉంది. వాళ్లు ఎటువైపు మొగ్గితే అటువైపు పార్టీ గెలవడం ఆనవాయితీగా వస్తోంది.
ఆమధ్య భీమవరంలో పవన్ ఫ్యాన్స్‌కీ – ప్రభాస్ ఫ్యాన్స్‌కీ మధ్య గొడవలు జరిగాయి. ఫ్లెక్సీ వివాదం చినికి చినికి గాలివానగా మారింది. ఇరు వర్గాలూ పోలీస్‌స్టేషన్ వరకూ వెళ్లాయి. అప్పటి నుంచి ప్రభాస్ – పవన్ ఫ్యాన్స్ మధ్య నువ్వా నేనా? అన్న రీతిలో సాగుతోంది వ్యవహారం. వీళ్లంతా పవన్ కల్యాణ్‌కి యాంటీ అయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే… ఈ విషయం తెలిసి కూడా పవన్ అక్కడ బరిలోకి ఎలా దిగ గలుగుతున్నాడన్నదే ప్రశ్న.
అయితే పవన్ ఎత్తుగడకు బలమైన కారణం ఉంది. విష్ణు కాలేజీ నడుపుతున్న పీవీ రాజు ఇప్పుడు జనసేన పక్షంలో చేరారు. ఆయన పార్టీకి ప్రధాన బలంగా మారారు. క్షత్రియ ఓట్లన్నీ ఆయన రాకతో జనసేనకు బదిలీ అవుతాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ధైర్యంతోనే ప్రభాస్ ఫ్యాన్స్ యాంటీ అని తెలిసినా… పవన్ కల్యాణ్ ధైర్యం చేశారని విశ్లేషకులు చెబుతున్నారు.
–