తెలంగాణ టీవీ చానళ్లు, పత్రికల్లో ఆంధ్రా వార్తలు ఎందుకన్న వాదనను… తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు ప్రధానంగా వినిపిస్తూంటారు. సాక్షాత్తూ.. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ అధినేత కేటీఆర్ కూడా.. ఇదే మాటలు చాలా సార్లు మీడియా ముఖంగానే చెప్పారు. చెప్పడమే కాదు.. చాలా మందితో.. నిజమే కదా అనిపించారు. దానికి తగ్గట్లుగానే.. వారికి సంబంధించిన నమస్తే తెలంగాణ, టీ చానల్, ఇతర అనుబంధ పత్రికల్లో… ఆంధ్రా వార్తలు కనిపించవు. ఏదో పెద్ద బ్రేకింగ్ న్యూస్ జరిగితే తప్ప.. పట్టించుకోరు. అయితే ఆ విధానం… ఇప్పుడు మారిపోయింది. వారి పేపర్లలో ఆంధ్రా వార్తలకు ప్రాధాన్యం లభిస్తోంది. ఏపీ ఎన్నికల్లో అక్కడి నాయకుల ప్రచారానికి అగ్రతాంబూలం లభిస్తోంది. ఓ అరగంట న్యూస్ బులెటిన్లో కనీసం.. పది నిమిషాలు ఇప్పుడు ఆంధ్రా వార్తలు కనిపిస్తున్నాయి. ఇంత మార్పు ఎందుకొచ్చింది..?
రాజకీయం మారింది కాబట్టి.. ఇప్పుడు ఆయా చానళ్లు, పేపర్లకు కూడా ఆంధ్రా వార్తలు అవసరం అనిపించాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొన్నటి మొన్న తెలంగాణ ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూడా కేటీఆర్… ఆందోల్ నుంచి గెలిచిన జర్నలిస్ట్ క్రాంతికిరణ్ సన్మానసభలో ఇదే మాట చెప్పారు. అయినప్పటికీ… పనిగట్టుకుని ఏపీ వార్తలు వేస్తున్నారంటే.. మరి మారిపోయిన రాజకీయమే సాక్ష్యం కదా..!. అయితే.. అన్ని రకాల ఆంధ్రా వార్తలు ఆయా చానళ్లు, పత్రికల్లో రావడం లేదు. కేవలం.. తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా.. జగన్మోహన్ రెడ్డి పార్టీకి అనుకూలంగా ఉన్న వార్తలు మాత్రమే వస్తున్నాయి. నేరుగా… సాక్షి టీవీకి చెందిన డౌన్లింగ్.. టీ చానల్ కార్యాలంయం ఉన్న తెలంగాణ భవన్కు అందుతోంది. వాటినే… టెలికాస్ట్ చేస్తున్నారు. ప్రత్యేకహోదాపై తాను మాట్లాడిన “బోరింగ్” మాటలను కవర్ చేసుకునేందుకు పీవీపీ ప్రెస్ మీట్ పెడితే.. ఏక కాలంలో సాక్షి నెట్వర్క్ సిగ్నల్.. టీ చానల్లో కనిపించింది. అంటే.. ఎంత అండర్ స్టాండింగ్ ఉన్నట్లు..!
సరే ఏ విధంగా అయినా… అసలు ఆంధ్రా వార్తలు మాకెందుకు అన్న మీడియాలోనే… ఆంధ్ర వార్తలకు ప్రాధాన్యం లభిస్తోంది. అది ఓ పార్టీకి వ్యతిరేకం..మరో పార్టీకి అనుకూలం అయినప్పటికీ.. అవి కూడా వార్తలే. ఏదైనా.. కానీ.. ఈ విధంగా అయినా… మీడియా అన్న తర్వాత దానికో ఎజెండా ఉంటుందని… ఎవరి ప్రయారిటీకి తగ్గట్లుగా వాళ్లు వార్తలు వేసుకుంటారని… ఆ చానళ్లు, పేపర్ల యాజమాన్యానికి తెలిసి ఉంటుంది. ఇక ఎప్పుడూ.. వారు… తెలంగాణలో ఆంధ్ర వార్తలెందుకు. …? అన్న ప్రకటనలు చేయరనే… మీడియా వర్గాలు అంచనాకు వస్తున్నాయి.