ఎన్టీఆర్ జీవితంలోని చివరి ఘట్టాన్ని `లక్ష్మీస్ ఎన్టీఆర్` పేరుతో తీసి సొమ్ములు చేసే పనిలో ఉన్నాడు రాంగోపాల్ వర్మ. నెగిటీవ్ పబ్లిసిటీ చేసుకుంటూ… ఈ సినిమాపై క్రేజ్ పెంచుకొచ్చాడు వర్మ. సినిమాలో విషయం ఉన్నా, లేకపోయినా.. ఈ హైప్‌కి ఓపెనింగ్స్రావడం ఖాయం. వర్మ తాజాగా వైఎస్ఆర్ జీవిత కథపైనా దృష్టి సారించాడట. ఇప్పటికే వైఎస్ కథతో `యాత్ర` తెరకెక్కింది. అయితే.. యాత్రలో కేవలం పాద యాత్రని మాత్రమే హైలెట్ చేశారు. అయితే యాత్రలో చూపించని కోణాల్ని, మరీ ముఖ్యంగా వైఎస్ఆర్ రాజకీయ నాయకుడిగా ఎదిగిన వైనం, సీఎమ్‌గా ఆయన మజిలీ, ఆయన చనిపోయాక రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు ఇవన్నీ ఈసినిమాలో కనిపించబోతున్నాయని తెలుస్తోంది. ఓ విధంగా ఇది యాత్రకి సీక్వెల్ ప్లస్ ప్రీక్వెల్ అనుకోవాలి. ఇందులో జగన్, చంద్రబాబు, చిరంజీవి (అప్పట్లో ప్రజారాజ్యం పార్టీ స్థాపించి.. టీడీపీ ఓట్లని చీల్చి కాంగ్రెస్‌కి పరోక్షంగా మేలు చేశారు) పాత్రలు కూడా ఉండబోతున్నాయని తెలుస్తోంది. తాను ఏ కథ తీసుకున్నా.. దాన్ని వివాదాల్లో ముంచి ప్రచారం చేసుకోవడం వర్మ స్టైల్. వైఎస్ సినిమాకీ అదే ఆయుధం అవ్వబోతోందేమో..??