రాష్ట్రం వైపు ఉంటారో.. అవినీతి పరులవైపు ఉంటారో.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ తేల్చుకోవాలని.. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు. జగన్, చంద్రబాబులకు సమానదూరం పాటిస్తామని.. పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై.. చంద్రబాబు ఈ విధంగా స్పందించారు. విశాఖ జిల్లా నర్సీపట్నం నియోజకవర్గంలో జరిగిన ఎన్నికల ప్రచారసభలో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో పవన్ కల్యాణ్..చంద్రబాబుపైనా విమర్శలు చేశారు. దానికి కూడా చంద్రబాబు కౌంటర్ ఇచ్చారు. తన గురించి మాట్లాడే అర్హత.. పవన్ కల్యాణ్‌కు లేదని మండి పడ్డారు. ఒక అవినీతిపరుడికి, తనకు సమాన దూరమా? అని ప్రశ్నించారు. నేరస్తుడికి.. తనకు పోలికా అని మండి పడ్డారు.
రాష్ట్రం పక్షాన ఉంటారా?… అవినీతిపరుల పక్షాన ఉంటారో పవన్ తేల్చుకోవాలన్నారు. పవన్‌కల్యాణ్‌కు కేసీఆర్‌ని ప్రశ్నించే ధైర్యం ఉందా? అని నిలదీశారు. కేసీఆర్‌కి ఊడిగం చేయడానికి జగన్ సిద్ధపడ్డారని విమర్శించారు. ఇది ఇవి రాష్ట్ర భవిష్యత్‌కు సంబంధించిన ఎన్నికలని.. తెలంగాణ పాపిష్టి డబ్బు తీసుకొచ్చి మనపై దాడులు చేస్తున్నారని విమర్శించారు. మోదీ, కేసీఆర్, జగన్‌కు గుణపాఠం చెబుతామని.. కేసీఆర్ మీద ఒంటికాలిపై పోరాడాల్సి ఉందన్నారు. ఈ క్రమంలో.. పవన్ కల్యాణ్‌ను కలిసి రావాలని పిలుపునిచ్చారు.
పవన్ కల్యాణ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్యూలో… జగన్‌తో పాటు.. చంద్రబాబుపైనా విమర్శలు గుప్పించారు. తాము ఎవరికీ దగ్గర కాబోమని ప్రశ్నించారు. ఆ క్రమంలో ఇద్దరికీ సమాన దూరం అన్నారు. దీనిపైనే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా.. వైసీపీ, ఆ పార్టీకి చెందిన మీడియా టీడీపీ, జనసేనల మధ్య అవగాహన ఉందని ప్రచారం చేస్తున్నాయి. ఈ క్రమంలో… పవన్ కల్యాణ్… జనసేన ఎవరితోనూ… సన్నిహితంగా ఉండదని చెప్పేందుకు ప్రయత్నించారు. అదే సమయంలో పవన్ కల్యాణ్.. జగన్‌పై ఎక్కువగా విమర్శలు చేస్తున్నారు. అయితే.. టీడీపీ అధినేత మాత్రం.. ఎవరి వైపు ఉంటారో చెప్పాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.