హైదరాబాద్: నిన్న మీడియాతో మాట్లాడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ప్రజలమధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ తెలంగాణ న్యాయవాదులు జుబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన ఇరు రాష్ట్రాలమధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నాలు ఇకనైనా మానుకోవాలని పవన్‌కు హితవు పలికారు. పవన్‌పై తెలంగాణ న్యాయవాదులు కన్నెర్ర చేయటం ఇదే మొదటిసారి కాదు. గోపాల, గోపాల సినిమా విడుదలకాకముందుకూడా వారు ఆయనపై ఇదేరకమైన ఫిర్యాదు చేశారు. ఆ సినిమాలో తమను కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని తమకు తెలిసిందని ఫిర్యాదులో పేర్కొన్నారు. తీరా చూస్తే సినిమాలో అలాంటి సన్నివేశాలేమీ లేకపోవటంతో ఆ కేసు ఏమైందోకూడా అడ్రస్ కూడా తెలియకుండా పోయింది. టి న్యాయవాదులు ఇంతకుముందు కాంగ్రెస్, టీడీపీల నేతలపైనా ఇలాంటి అసంబద్ధమైన కేసులు పెట్టారు. కొన్నిసార్లు న్యాయమూర్తితో తిట్లుకూడా తిన్నారు. మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, ఏపీ ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు లోకేష్, ఏపీ ఎన్జీవో నేత అశోక్‌బాబు, అనంతపురంజిల్లా ఎమ్మెల్యే గుర్నాథరెడ్డిలపైకూడా ఇలాంటి కేసులు అనేకం పెట్టారు తెలంగాణ న్యాయవాదులు. చంద్రబాబునాయుడుమీదయితే దాదాపుగా నెలకు ఒక కేసుచొప్పున నమోదు చేస్తుంటారు. టీఆర్ఎస్ తప్ప అన్ని పార్టీల నేతలపైనా ఇలాంటి సిల్లీ కేసులు నమోదు చేస్తుండే వీరు ఏ పార్టీకి చెందినవారో ప్రత్యేకంగా చెప్పనవసరంలేదనుకుంటా!