భట్టికి ప్రతిపక్ష హోదా నేత గల్లంతు..! దళిత ఆత్మగౌరవ పోరాటానికి కాంగ్రెస్ ప్రణాళిక..!

తెలంగాణ సీఎం కేసీఆర్‌ను.. దళిత అస్త్రంతో ఎదుర్కోవాలని.. కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని మాట తప్పిన కేసీఆర్ కనీసం ప్రతిపక్షనేతగా కూడా దళితుణ్నిఅంగీకరించే పరిస్థితిలో లేరన్న అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. ఆత్మగౌరవ పోరాటం చేయాలని అన్ని పార్టీల్లోని దళిత నేతలను సమీకరించడానికి ప్రయత్నిస్తున్నారు. ఇందు కోసం.. కాంగ్రెస్ పార్టీ అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. జుగుప్సాకరంగా ఎమ్మెల్యేల ఫిరాయింపులు జరుగుతన్నాయని అఖిలపక్ష నేతలు అంటున్నారు. దళితున్ని సీఎం చేస్తానన్న కేసీఆర్.. దళితుడు ప్రతిపక్ష నేతగా ఉండటానికి కూడా ఇష్టపడటం లేదని టీడీపీ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి ఆరోపించారు. గవర్నర్ కు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టే బాద్యత ఉంటుందని ఆయన గుర్తుచేశారు.

భట్టి ప్రతిపక్ష హోదా కోల్పోతే.. కేసీఆర్ పై మాత్రం ఆ మచ్చ శాశ్వతంగా ఉంటుందని సీపీఐ నేత చాడా వెంకట్ రెడ్డి అంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి కనీసం ప్రతిపక్ష హోదా లేకుండా చేయాలన్న ఉద్దేశంలో కేసీఆర్ ఉన్నారు. అందుకే.. ఎమ్మెల్యేలను ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే.. ఆ పని పూర్తయిందని.. లాంఛనంగా.. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదాను రద్దు చేయడమే మిగిలిందంటున్నారు. ఈ క్రమంలోనే టీఆర్ఎస్ మినహా అన్ని పక్షాల్లో ఇదే ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో ఫిరాయింపులు వికృతం దాల్చాయని టీజెఎస్ అధ్యక్షులు కోదండరాం ఆగ్రహం వ్యక్తం చేశారు. బలమైన శక్తి కనిపించినప్పుడు ఇప్పుడు పార్టీ మారిన వారు కూడా నీ వెంట ఉండరనే సత్యాన్ని కేసీఆర్ గ్రహించాలని కోదండరాం హితువు పలికారు.

కేసీఆర్ కూడా ఎప్పుడో ఒకప్పుడు ఒంటరి కాకతప్పదని హెచ్చరించారు. ఫిరాయింపుల పై కాంగ్రెస్‌ ఎలాంటి ఆందోళన కార్యక్రమాలు చేపట్టిన తాము సంపూర్ణ మద్దతు ఉంటుందని అఖిపక్ష నేతలు హామీ ఇచ్చారు. పార్టీ మారిన నేతల ఇండ్లకు వెళ్లి నిలదీయాలని గద్దర్ సూచిస్తున్నారు. మొత్తానికి ఫిరాయింపులు దళిత ఆత్మగౌరవపోరాటంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

మారుతికి ముందే తెలుసా?

రాజ్ తరుణ్ కి హ్యాట్రిక్ ఫ్లాపులు పడ్డాయి. రెండు నెలల వ్యవధిలో మూడు సినిమాలు రాజ్ నుంచి వచ్చాయి. పురుషోత్తముడు, తిరగబడరాస్వామి, భలే ఉన్నాడే. ఈ మూడు ఫ్లాపులే. భలే ఉన్నాడే చాలా...

బంగ్లాని లైట్ తీసుకోవద్దు బాసూ

ఇండియా - బంగ్లాదేశ్‌ టెస్ట్ సిరీస్ ఈనెల‌ 19 నుంచి ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ 2023-25 సీజన్‌లో రాబోయే పది టెస్టులు టీమ్‌ఇండియాకు అత్యంత కీలకం. అందుకే ఈ సిరీస్ ప్రాధాన్యతని సంతరించుకుంది....

చిట్‌చాట్‌లతో BRSను చిరాకు పెడుతున్న రేవంత్ !

రేవంత్ రెడ్డి మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడే మాటలు మీడియాలో హైలెట్ అవుతూంటాయి. వాటిని పట్టుకుని బీఆర్ఎస్ ఆవేశ పడుతోంది . అంతా అయిపోయిన తరవాత తీరిగ్గా.. నేను ఎప్పుడన్నాను అని రేవంత్...

ఢిల్లీ తర్వాత సీఎం కూడా కేజ్రీవాలే ?

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మంగళవారం రాజీనామా చేయబోతున్నారు. అదే రోజు ఢిల్లీ శాసనసభాపక్ష సమావేశం కూడా నిర్వహిస్తున్నారు. కొత్త సీఎంగా కేజ్రీవాల్ ఎవరికి చాన్సిస్తారన్నది హాట్ టాపిక్ గా మారింది. విచిత్రంగా...

HOT NEWS

css.php
[X] Close
[X] Close