వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం.. తెలంగాణ రాష్ట్ర సమితి నేతలు, అక్కడి ప్రభుత్వం… చేయకూడనన్ని పనులు చేస్తోంది. నేరుగా మద్దతు ప్రకటించి ఉంటే… రాజకీయం వేరేగా ఉండేది. వైసీపీకి దాదాపుగా తెలంగాణ పోలీసుల్ని అప్పగించేసిందన్న విమర్శలు ఉన్నాయి. సోషల్ మీడియాపై ఫిర్యాదులు, డేటా చోరీ అంటూ.. కుట్రకోణాలు అన్నీ బయటకు రావడం, ఇప్పుడు.. నేరుగా.. వైసీపీలో చేరాలని.. టీడీపీ నేతల్ని బెదిరించడం కూడా… ఏపీ ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బతీస్తోంది.
ఏపీలో తెలంగాణ సామంత ప్రభుత్వం కావాలా..?
ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి రావాలని.. ఆంధ్రోళ్లపై దండెత్తి.. తెలంగాణ తెచ్చుకున్న కేసీఆర్‌గారు.. ఆయన కుమార రత్నం.. కేటీఆర్ తెగ ఇదైపోతున్నారు. అవసరం ఉన్న దగ్గరా.. లేని దగ్గరా.. చంద్రబాబు ఓడిపోతారని.. జోస్యం చెబుతున్నారు. తమ ప్రతాపం అని చెప్పుకోవడానికి..అప్పుడప్పుడూ తామే ఓడిస్తామని కూడా.. చెప్పడానికి వెనుకాడటం లేదు. ఆంధ్రలంతా రాక్షసులే అన్న నోటితోనే.. ఇప్పుడు తెలివైన వాళ్లు.. జగన్‌ను గెలిపిస్తారంటూ.. మోసేస్తున్నారు. అసలు ఆంధ్రకు వ్యతిరేకంగా మాట్లాడలేదని.. నాలుక అడ్డంగా మడతేస్తున్నారు కానీ.. అసలు తెలంగాణ ఉద్యమాన్ని నిలబెట్టింది.. ఆ “ఆంధ్రా వ్యతిరేకత” మీదే అని… అలాంటి తమ పార్టీ మూల స్తంభాన్నే మర్చిపోతున్నట్లు .. గుర్తు లేనట్లు నటిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు.. తెలంగాణలో ప్రచారం చేస్తే ఏమన్నారు..? ఆంధ్ర పెత్తనం మనకవసరమా..? అని ఊరూవాడా ప్రచారం చేశారా లేదా..? మీరేదో వీరోచితంగా.. ఆంధ్రోళ్లను… తరిమికొడితే… మళ్లీ కాంగ్రెసోళ్లు.. చంద్రబాబు రూపంలో ఆంధ్రపెత్తనాన్ని తీసుకొస్తున్నారని ప్రచారం చేసి.. సెంటిమెంట్ రేపి.. ఓట్ల పండుగ చేసుకున్నారా లేదా..? .
ఆంధ్రోడ్ని రాక్షుసులన్నవాళ్లకి దాసోహం కావాలా..?
ఆంధ్రోడిని బూతులు తిట్టి ..వారిపై విషం చిమ్మి.. అంతగా ఓట్లను పొందిన.. మీకే అంత అంటే… తమను… బూచిగా చూపి… గెలిచిన మిమ్మల్ని చూస్తే.. ఆంధ్రులకు ఇంకెంత మండాలి..? ఇంకెంత పౌరుషం రావాలి..? ఏ ఆంధ్రులనైతే.. విలన్లుగా చూపించి.. తెలంగాణ ఉద్యమం నడిపించారో.. అదే ఆంధ్రుల్ని… ఇప్పుడు.. మీరు పొగుడుతూ.. జగన్‌ను గెలిపించాలని కోరుతున్నారంటే.. ఏమిటి అర్థం..?. మీ కోరిక నెరవేర్చడానికి ఆంధ్రోళ్లంతా మీరనుకునేంత సిగ్గు మాలిన వాళ్లులా కనిపిస్తున్నారా..? తెలంగాణ ఎగువ రాష్ట్రం. ఏపీ దిగువ రాష్ట్రం. ఉత్తినే సముద్రంలోకి పోయే నీళ్లను.. మళ్లించుకుంటే.. రైతులు కొంత బాగుపడ్డారు. అంతే.. పై నుంచి.. ఎగువ రాష్ట్రాలు నిల్వ చేసుకున్న నీటిని ఏపీ ఏం తోడుకోలేదు. అక్రమ ప్రాజెక్టులు కట్టీ.. కట్టీ.. కృష్ణాలోకి నీరు రాకుండా పోయింది. అంతో..ఇంతో వర్షాకాలంలో వచ్చేది గోదావరి వరదే. ఈ నీటినే పట్టిసీమ ద్వారా కృష్ణాకు మళ్లించుకుంటే.. నీళ్లు దోచుకున్నట్లుగా.. ఢిల్లీకి ఫిర్యాదులు చేసిన… రాష్ట్రం మీదే కదా..! పోలవరం మీద కేసులు వేయించింది మీరే కదా..! పోలవరానికి వ్యతిరేకంగా.. ఢిల్లీ స్థాయిలో కుట్రలు చేసింది.. పోలవరాన్ని వ్యతిరేకిస్తున్న నవీన్ పట్నాయక్‌తో ప్రత్యేకంగా మంతనాలు జరిపింది మీరే కదా..!. ఎగువ రాష్ట్రంగా.. ఓ వైపు.. ఏపీకి రావాల్సిన నీటిని రానీయకుండా చేసేందుకు.. ప్రాజెక్టులు కడుతూ.. సముద్రంలోకి పోయే నీటిని సమర్థంగా వాడుకున్నందుకు కూడా ఏపీపై ఏడుస్తున్న మిమ్మల్ని.. మీ వందిమాగధుల్ని.. గౌరవించి పంపించడం .. ఆంధ్రుల చేతకానితనమేనా..?
ఏపీ వనరుల్ని కట్టబెట్టే కుట్రలకు బలి కావాలా..?
ఏపీలో జగన్మోహన్ రెడ్డి ఎందుకు గెలవాలి..? . ఆయన కోసం.. టీఆర్ఎస్ ఎందుకు అంత తాపత్రయ పడుతోంది..? చంద్రబాబునాయుడు.. ఎందుకు గెలవకూడదు..! చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉంటే.. పరిశ్రమలు హైదరాబాద్‌కు రావనేనా..?. గత ఐదేళ్ల కాలంలో.. హైదరాబాద్‌లో ఒక్కటంటే.. ఒక్కటైనా మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్‌ను పూర్తి చేయగలిగారా..? ఐదేళ్ల నుంచి ఫ్లైఓవర్ల నిర్మాణం సాగుతుంటే.. కనీసం.. 50 శాతం కూడా పూర్తి కాక… వాహనదారులకు నరకం చూపిస్తున్నది నిజం కాదా..? మెట్రో ఆలస్యానికి కారణం ఎవరు..?. కేసీఆర్ అడ్డుపడకపోతే.. ఈ పాటికి… రెండో దశ పూర్తయ్యేది కాదా..?. ఈ ఐదేళ్ల కాలంలో… తెలంగాణకు వచ్చిన ఒక్క భారీ పరిశ్రమ పేరు చెప్పగలరా..? ప్రకటనలు కాదు.. కనీసం..మెటీరియలైజ్ అయిన ఒక్క పరిశ్రమ పేరు చెప్పగలరా..?. నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత.. ఏపీకి కియా నంచి హెచ్‌సీఎల్ వరకు.. ఏపీకి వచ్చిన భారీ పరిశ్రమల జాబితా… ఆంధ్రులు చెప్పగలరు..? మీరు… ఐదేళ్లలో సాధించిన పరిశ్రమలు, కల్పించిన ఉద్యోగాల జాబితా ఇవ్వగలరా..?. ఏపీ గ్రామాల్లో ఐదేళ్లలో మారిన పరిస్థితులను.. తెలంగాణ ఐదేళ్ల పరిస్థితులను పోల్చి చూద్దామా..? . ఇవన్నీ మరుగుపర్చి.. ఏపీ కంటే.. తెలంగాణనే బెటర్ అని చెప్పుకోవాలంటే.. జగన్ రావాలా..? అందుకేనా.. జగన్ కంటే… ఎక్కువగా.. మీరు ఇన్వాల్వ్ అవుతున్నారు..?
ఆంధ్రుడికీ రోషం ఉంది..! పౌరుషం ఉంది..!
కేసుల భయంతోనే.. మరో కారణంతోనే… జగన్మోహన్ రెడ్డి.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే.. ఏపీ ప్రయోజనాల కోసం… కనీసం నోరెత్తే సాహసం చేయడం లేదు. పైగా… వైఎస్ కడుపున పుట్టిన ఆయన.. వైఎస్.. తీవ్రంగా ద్వేషించిన కేసీఆర్‌ను… హీరో అని పొగిడేస్తున్నారు. మోడీపై అమితమైన గౌరవం చూపుతున్నరు. ఇక సీఎం అయిన తర్వాత ఎలా ఉంటారు..? ఏపీ ప్రజల ఆత్మగౌరవాన్ని … కేసీఆర్ కాళ్ల దగ్గర.. మోడీ మోకాళ్ల దగ్గర పెట్టడా…?. ఏపీని సామంతరాజ్యంగా చేసుకోవడానికేనా.. జగన్ రావాలి..! మీరు ఆంధ్రపెత్తనం వద్దని.. ఎంతగా ప్రజలకు చెప్పి.. వారి మద్దతు పొందారో.. ఆంధ్రులకు గుర్తు ఉంది. ఆంధ్రులు కూడా.. అంతే కంటే ఎక్కువగా తెలంగాణ పెత్తనం వద్దనుకుంటారు. ఆంధ్రులకు తెలంగాణ వారి కంటే.. ఎక్కువ పౌరుషం ఉంది… !