ఎన్నికల సమయంలో అన్ని రాజకీయ పార్టీలు ప్రచారానికి ప్రాధాన్యం ఇస్తాయి. మద్దతుగా ఉన్న విభిన్న రంగాల ప్రముఖులతో.. చెప్పించుకుంటాయి. అందులో సందేహం ఏమీ లేదు. తప్పు కూడా కాదు. ఈ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భిన్నంగా కనిపిస్తోంది. ఆర్థిక, సామాజిక, వ్యాపార రంగాల్లోని ప్రముఖుల్ని వైసీపీ పట్టించుకోవడం లేదు. కానీ.. సినీ ఇండస్ట్రీ నుంచి మాత్రం.. కొంత మందిని రంగంలోకి దింపుతోంది. వారితో ప్రెస్ మీట్లు పెట్టించి… వాటినే పేజీలకు పేజీలు రాస్తోంది. ఇప్పటికే చాలా మంది వచ్చారు. త్వరలో మరికొంత మంది రాబోతున్నారు.
అవడానికి నటులే కానీ కుల సంఘ పెద్దలుగా పిలుపునిస్తున్నారేంటి..?
నా పేరు పోసాని.. నేను కమ్మ.. కమ్మవాళ్లంతా జగన్‌కే ఓటేయండి..!
నా పేరు కోన వెంకట్.. నేను బ్రాహ్మణుడ్ని.. జంధ్య వేసుకున్న వారంతా… జగన్‌కే ఓటేయండి..!
నా పేరు ఆకుల చిన్ని కృష్ణ.. నేను కాపు.. కాపులందరూ.. జగన్‌కే ఓటు వేయండి..! .. . ఎవరి లాంగ్వేజ్‌లో వారు చెప్పినా అంతిమంగా.. పై ముగ్గురూ చెప్పినది ఒకటే. ఏదో ఒక కారణం వెదుక్కుని ప్రెస్ మీట్ పెట్టడం… ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం.. తర్వాత రోజు దాన్ని సాక్షి పత్రికలో.. జగన్ కే ఓటు వేయండి.. అని పిలుపునిచ్చినట్లుగా.. ప్రచురించడం కామన్‌గా మారిపోయింది. రేపు మాపో శివాజీ రాజా.. అనే ఫేడవుట్ అయిన ఆర్టిస్ట్ కూడా… రాబోతున్నారని.. ఇంతకు ముందే చెప్పుకున్నారు… కాబట్టి.. ఆయనకు ఓ రెండు పేజీలు .. సాక్షి పత్రికలో రిజర్వ్ చేసి ఉంచారు.
ఆయన వచ్చి.. నేను రాజును.. రాజులంతా.. జగన్ అన్నకే ఓటేయండి.. అంటారు… దట్స్ కామన్..!
ఇతరులను తిట్టి జగన్‌ను పొగడటమే వీళ్ల రాజకీయమా…?
జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఓటు వేయాలో వీరెవరూ చెప్పడం లేదు. ఎదుటి వ్యక్తుల్ని.. పార్టీల్నీ తమకు చేతనైన భాషలో ఘాటుగా తిట్టి… జగన్‌కు ఓటు వేయమని పిలుపునిస్తున్నారు. అందులోనూ.. కులాల ఈక్వేషన్లు. కమ్మ సామాజికవర్గానికి చెందిన చంద్రబాబుపై.. అదే సామాజికవర్గానికి చెందిన పోసాని కృష్ణమురళీని వదులుతారు. ఆయన ఎవర్నీ. . ఎంత మాట అయినా అనొచ్చన్నది రాజ్యాంగం ఇచ్చిన వరమని చెలరేగిపోతారు. అలాగే.. పవన్ కల్యాణ్‌ది కాపు సామాజికవర్గం కాబట్టి.. దానికి చిన్ని కృష్ణ అనే రచయితను ఎంచుకున్నారు. ఆయన సామాజికవర్గం అందరికీ తెలియాలనేమో… ప్రత్యేకంగా కులం పేరు పెట్టి పరిచయం చేసుకున్నారు. ఇక కోన వెంటనే అనే మహానుభావుడైతే.. జంధ్యాన్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చారు. రేపు శివాజీ రాజా ఎం చెబుతారో.. అల్లూరి సీతారామరాజే.. జగన్ రూపంలో పుట్టారంటాడమో..?
రాజకీయాల్లో నటించి టాలీవుడ్‌ను చులకన చేస్తున్నారు..!
టాలీవుడ్ నటులు… ఇతర పార్టీలకు మద్దతు తెలియచేయడం తప్పు కాదు. గతంలో చాలా మంది చేశారు. కానీ వారికి.. వీరికి తేడా ఏమిటంటే.. వారు తమకు మద్దతుగా ఉన్న వారికి ప్రచారం చేశారు. కానీ వీరు.. తాము మద్దతిస్తున్న వారి ప్రత్యర్థులపై నోరు పారేసుకుంటున్నారు. అదే ప్రచారం అనుకుంటున్నారు. టాలీవుడ్ నటులు.. రాజకీయాల్లో ఎందుకు నటించాల్సి వస్తుందో చాలా మందికి అర్థం కావడం లేదు. బహుశా.. వారికి సినిమాల్లో రాని టెంప్టింగ్ ఆఫర్స్.. వైసీపీ నుంచి వస్తున్నాయి కావొచ్చు. తమ రేంజ్‌కి.. వారు ఇస్తున్న ఆఫర్స్‌కి.. సంబంధం లేకపోవడంతో.. వారు కూడా.. ఎట్రాక్ట్ అవుతున్నారని అనుకోవచ్చు. అయితే.. వీళ్ల మాటలు విని ప్రజలు మారుతారా.. అన్నదే కీలకం.
వైసీపీకి వీళ్లే మహానుభావులా..?
ఏదైనా రంగంలో.. దశాబ్దాలుగా కష్టపడి.. పేరు తెచ్చుకున్న వారికి విలువ ఉంటుంది కానీ… ఇలా.. రాజకీయాల కోసం నటించే వారికి విలువ ఏముంటుంది..? ఈ విషయంలో.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి .. ఇతర రంగాల నిపుణులు ఎవరూ పాజిటివ్ గా మాట్లాడటం లేదేమో కానీ… ఇలాంటి క్యారెక్టర్ ఆర్టిస్టులకు ఎక్కువ.. జూనియర్ ఆర్టిస్టులకు తక్కువ లాంటి వాళ్లను పోగేసి… కులాల పేరుతో… పిలుపునిప్పిస్తే… ఏం ప్రయోజనం ఒరుగుతుంది..?