నితిన్ పక్కన రెండు సినిమాలు చేసి, చిట్టి పొట్టి బట్టలతో తళుక్కున మెరిసింది మేఘా ఆకాష్. పైగా ఆ ఇద్దరి మధ్య ఏదో వుందన్నగుసగుసలు కూడా. కానీ సరైన హిట్ మాత్రం పడలేదు. దాంతో మళ్లీ సినిమా రాలేదు. కానీ చిన్న, మీడియం హీరోల పక్కన మేఘా మంచి ఛాయిస్ నే . అందుకే ఇప్పుడు ఆమెను రాజ్ తరుణ్ పక్కన తీసుకుంటున్నారు.
నిర్మాత దిల్ రాజు దర్శకుడు కృష్ణారెడ్డితో నిర్మించే సినిమాలో మేఘ ఆకాష్ ను హీరోయిన్ గా తీసుకుంటున్నారు. ఈ సినిమా ఉగాది నుంచి సెట్ మీదకు వెళ్తుంది. ఇటీవల సరైన ప్రాజెక్టు కోసం చూస్తూ రాజ్ తరుణ్ కాస్త గ్యాప్ తీసుకున్నాడు. ఈ ప్రాజెక్టు సెట్ అయింది. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ ప్రాజెక్టుతో మళ్లీ లైన్లో పడుతుంది కెరియర్ అని భావిస్తున్నాడు రాజ్ తరుణ్.
ఈ సినిమాతో పాటు శర్వానంద్ సినిమా (96 రీమేక్), చైతన్య సినిమా లను కూడా సమాంతరంగా నిర్మించే పనిలో వున్నారు దిల్ రాజు. అదే విధంగా ఇంద్రగంటి డైరక్షన్ లో నాని-సుధీర్ బాబు సినిమా కూడా వుంది. ఈ సినిమాలు అన్నీ ఈ ఏడాది విడుదల టార్గెట్ గా రెడీ చేయాలనుకుంటున్నారు దిల్ రాజు.