వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ విధానాలపై.. చాలా కాలం నుంచి విమర్శలు ఉన్నాయి. అయితే.. ఈ ఎన్నికల సందర్భంగా.. అవి మరింతగా శృతి మించుతున్నాయి. నారా, నందమూరి కుటుంబాల మధ్య విబేధాలు ఉన్నాయని చెప్పేందుకు… ప్రయత్నించడానికి… అనేక రకాల కథనాలు వండి వారుస్తున్నారు. అదే సమయంలో.. నారా కుటుంబంలో…. నందమూరి కుటుంబంలోనూ.. విడివిడిగా.. కొంత మందిని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారన్న ఆరోపణలు గట్టిగానే వినిపిస్తున్నాయి. టిక్కెట్ ఆశ చూపి.. వైసీపీలో జూనియర్ ఎన్టీఆర్‌కు మామ అయిన నార్నె శ్రీనివాసరావును.. జగన్మోహన్ రెడ్డి పార్టీలో చేర్చుకున్నారు. కానీ ఆయనకు టిక్కెట్ ఇవ్వలేదు. ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పి.. ఇప్పుడు… ఆయనతో.. నారా, నందమూరి కుటుంబాల మధ్య మరింతగా విబేధాలు పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
కొమ్మినేని శ్రీనివాసరావు.. అనే సీనియర్ జర్నలిస్ట్.. ఈ నార్నె శ్రీనివాసరావును ఇంటర్యూ చేసి… పూర్తిగా.. కుటుంబ విబేధాలను… బయటకు తెచ్చి.. చంద్రబాబుపై తీవ్ర విమర్శలు చేసేలా… చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌కు పిల్లను ఇవ్వక ముందు.. చంద్రబాబు కుటుంబంతో…నార్నె కు దగ్గర సంబంధాలున్నాయి. నార్నె శ్రీనివసరావు భార్య.. చంద్రబాబు మేనకోడలు. ఆమె బాధ్యత మొత్తం చంద్రబాబు తీసుకున్నారని.. బంధువర్గాలకు తెలుసు. ఎన్టీఆర్‌తో సంబంధాన్ని కూడా చంద్రబాబే ఖరారు చేశారని.. అప్పట్లో ప్రచారం జరిగింది. అంతకు ముందు స్టూడియో ఎన్ అనే చానల్‌ను.. నార్నె నిర్వహించేవారు. కొన్నాళ్లు.. ఆ బాధ్యతలు లోకేష్ తీసుకున్నారు కూడా. అప్పటి వరకూ బాగున్న సంబంధాలు ఆ తర్వాత దెబ్బతిన్నాయి.
కుటుంబాల్లో ఉన్న చిన్న చిన్న కలతల్ని ఆసరా చేసుకున్న వారికి గాలం వేసి… సొంత కుటుంబసభ్యులపైనే.. తీవ్రమైన విమర్శలు చేసేలా సాక్షి మీడియా ప్రొత్సహిస్తోంది. అనారోగ్యంతో.. మంచానికే పరిమితమైన…చంద్రబాబునాయుడు సోదరుడు రామ్మూర్తి నాయుడిపై అనుచితమైన కామెంట్లు చేయించి.. దానికి ప్రాధాన్యం ఇప్పించారు. దానికి నారా రోహిత్ ఘాటుగానే కౌంటర్ ఇచ్చారు. అయితే…అసలు ఇలా… కుటుంబాల్లో ఉన్న విబేధాలను… మీడియాకు ఎక్కించి.. ఒకరిపై ఒకరు అనుచితమైన వ్యాఖ్యలు చేయించి రాజకీయం చేయడం ఏమిటన్న విమర్శలు… వైసీపీ.. ఆ పార్టీకి చెందిన మీడియాపై గట్టిగానే వస్తున్నాయి. కానీ రాజకీయ ప్రయోజనాలే… అంతిమలక్ష్యం అయినప్పుడు.. ఈ విమర్శలను వాళ్లు పట్టించుకునే అవకాశం లేదు.