ప్రముఖ నటి, మాజీ ఎంపీ జయప్రద భారతీయ జనతా పార్టీలో చేరారు. ఈ సారి ఎన్నికల్లో ఆమె ఉత్తరప్రదేశ్ నుంచే పోటీ చేయబోతున్నారు. గతంలో తాను రెండు సార్లు సమాజ్‌వాదీ పార్టీ తరపున విజయం సాధించిన రాంపూర్ నియోజకవర్గం నుంచి.. ఈ సారి బీజేపీ టిక్కెట్ పై పోటీ చేయబోతున్నారు. అక్కడ ఆమె చిరకాల శత్రువు, సమాజ్ వాదీ పార్టీ నేత అజంఖాన్‌పై పోటీ పడబోతున్నారు. రాంపూర్ లోక్‌సభ స్థానం నుంచి 2004, 2009లో ఎంపీగా గెలిచారు. అమర్ సింగ్ అనే నేత..జయప్రదకు మెంటార్‌గా ఉన్నారు. ఆయన దేశంలోని అన్ని రాజకీయ పార్టీలతోనూ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తారు. సమాజ్‌వాదీ పార్టీ నేతల ములాయంసింగ్‌తో మరింత ఎక్కువ అనుబంధం ఉంది.
అయితే.. ఇటీవలి కాలంలో.. సమాజ్ వాదీ పార్టీ… ములాయం చేతి నుంచి ఆయన కుమారుడు అఖిలేష్ యాదవ్ చేతిలోకి వెళ్లింది. అఖిలేష్‌కు.. అమర్‌సింగ్‌కు పడదు. దాంతో..అమర్ సింగ్‌తో పాటు జయప్రదను కూడా పార్టీ నుంచి గెంటేశారు. ఆ తర్వాత అమర్ సింగ్ బీజేపీ నేతలకు దగ్గరయ్యారు. వారి ద్వారా.. ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్ టిక్కెట్‌ను అమర్ సింగ్.. జయప్రదకు ఇప్పించినట్లు ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమె రెండు సార్లు.. రాంపూర్ నుంచి గెలుపొందారు. అప్పుడు.. సమాజ్ వాదీ పార్టీలోనే ఉన్న అజంఖాన్.. జయప్రదను బాగా ఇబ్బంది పెట్టారు. ఇప్పుడు… అజంఖాన్ రాంపూర్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపైనే… జయప్రద పోటీ చేయబోతున్నారు. ఉత్తరప్రదేశ్‌లో.. ముస్లిం వర్గాలు ఎక్కువగా ఉండే నియోజకవర్గాల్లో రాంపూర్ ఒకటి.
అది సమాజ్ వాదీ పార్టీకి కంచుకోటలాంటిది. ఎస్పీ, బీఎస్పీ పొత్తుల్లో భాగంగా.. ఆ సీటును.. సమాజ్ వాదీ పార్టీనే ఉంచుకుంది. 1994లో జయప్రద రాజకీయ ప్రస్థానం తెలుగు దేశం పార్టీతో మొదలైంది. ఆ తర్వాత ఆమె జాతీయ రాజకీయాల్లోకి వెళ్లారు. ఎస్పీ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె టీడీపీ, వైసీపీల్లో చేరుతారని ప్రచారం జరిగింది కానీ చివరికి ఆమెకు.. తన పాత నియోజకవర్గంలోనే.. ప్రధాన పార్టీ అయిన బీజేపీ తరపునే అవకాశం లభించింది.