ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంగళవారం అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇంకా చెప్పాలంటే.. వైసీపీ కోణంలో ఇవి మరింత కీలకంగా మారాయి. అసలు ఎన్నికలు మొదటి దశలోనే ఉన్నాయి. ప్రచారం చేయాల్సిన నియోజకవర్గాలు.. అరవైకి పైగా ఉన్నాయని…. జగన్మోహన్ రెడ్డి.. అవిశ్రాంతంగా ప్రచారం చేస్తారని.. వైసీపీ వర్గాలు గతంలో ప్రకటించాయి. అయితే అనూహ్యంగా.. ఆయన మంగళవారం రోజు నుంచి ఇంటి నుంచి బయటకు రాలేదు. ప్రచారం ఆపేసి.. హైదరాబాద్లోని లోటస్పాండ్ ఇంట్లోనే ఉండిపోయారు. అదే సమయంలో… ఉదయం మోహన్ బాబును పార్టీలో చేర్చుకునే కార్యక్రమంలో… పాల్గొన్న ఆ పార్టీలో నెంబర్ టూ పొజిషన్లో ఉండే.. రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి.. ఆ తర్వాత బెంగళూరుకు వెళ్లిపోయి.. అనారోగ్యం పేరుతో అక్కడో ఆస్పత్రిలో చేరినట్లు ప్రచారం జరుగుతోంది. ఇవి రెండు ఇలా జరిగిన సమయంలో.. ఢిల్లీలో ఏం జరిగిందో కానీ… ముగ్గురు ఏపీకి చెందిన ఉన్నతాధికారుల్ని బదిలీ చేశారు. అందులో… కడప జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ కూడా ఉన్నారు.
ఎన్నికల సమయంలో… పోలీసు అధికారులపై.. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ నేతలు అనేక ఆరోపణలు చేస్తూంటారు. అంత ఎందుకు.. ఎన్నికల సంఘంపైనే.. దేశంలో ఉన్న అనేక… పార్టీలు.. ఆరోపణలు చేస్తూంటాయి. ఎన్నికల షెడ్యూల్ పూర్తిగా.. బీజేపీ కనుసన్నల్లో తయారైందని.. అందుకే… బీజేపీకి ఏ మాత్రం బలం లేని దక్షిణాది రాష్ట్రాల్లో సింగిల్ ఫేజ్లో పోలింగ్ పెట్టేసి… ఉత్తరాదిలో మాత్రం.. బీజేపీ నేతలు ప్రచారం చేసుకునేలా… సాగదీశారన్న ఆరోపణలు వచ్చాయి. ఇలాంటి ఆరోపణలు వస్తూనే ఉంటాయి. అంత మాత్రానికే.. ఏమీ చేయకుండా చర్యలు తీసుకునే సందర్భాలు ఉండవు. కానీ ఏపీ విషయంలో మాత్రం.. వైసీపీ ఫిర్యాదు చేయగానే… చర్యలు తీసుకున్నారు.
మొత్తంగా.. ప్రచారానికి వెళ్లకుండా.. జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి గూడుపుఠాణి నడిపారన్న ప్రచారం ఊపందుకుంటోంది. వివేకా హత్య కేసులో పోలీసులు అరెస్టులు చేయబోతున్నారనే సమాచారం బయటకు వస్తున్న సమయంలోనే… జగన్.. ఇంటి నుంచే వ్యవహారం నడిచిందని భావిస్తున్నారు. ఎలాగైనా.. తమ పలుకుబడి ఉపయోగించుకుని.. కడప ఎస్పీని బదిలీ చేయించారు. ఎన్నికల విధుల్లో ఆరోపణలు ఉంటేనే బదిలీ చేస్తారు. కానీ.. ఇక్కడ అలాంటి ఆరోపణలు లేకపోయినా.. ఈసీ పరిధి దాటి వ్యవహరించిందనే స్పష్టం అవుతోంది. అదే సమయంలో… విజయసాయిరెడ్డి.. బెంగళూరు ఆస్పత్రిలో ఎందుకు చేరాల్సి వచ్చిందనే అంశంపై… అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. దీనిపై… అసలు వివరాలు ముందు ముందు బయటకు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.