పొంగూరు నారాయణ. నారాయణ కాలేజీల అధినేత. అయితే ఆయన తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి సానుభూతిపరుడు. పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా… పార్టీ కోసం పని చేసిన వ్యక్తి. అయితే ఎప్పుడూ తెర ముందుకు రాలేదు. 2014 ఎన్నికల్లో ఉత్తరాంధ్ర బాధ్యతలు తీసుకుని.. మంచి ఫలితాలు రావడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన కృషికి మెచ్చి.. చంద్రబాబు .. ఎమ్మెల్సీని చేసి.. మంత్రి పదవిని కూడా ఇచ్చారు. ఇప్పుడు.. నారాయణ.. ప్రత్యక్ష ఎన్నికల్లో ప్రజల మద్దతు పొందాలని నిర్ణయించుకున్నారు. నెల్లూరు అర్బన్ నుంచి పోటీ చేస్తున్నారు.
ఏపీ మంత్రి నారాయణ సొంతూరు నెల్లూరే. ప్రభుత్వ పాఠశాలలో నేలపై కూర్చొని, పూరింట్లో నివాసం ఉంటూ, లాంతర్ల వెలుతురులో చదువుకుని కష్టపడి చదువుకుని పైకొచ్చారు. ఆయన తండ్రి బస్ కండక్టర్. ఇరవై అయిదేళ్లపాటు టీడీపీకి ఆయన చేసిన సేవలని గుర్తించి చంద్రబాబు, ఆయనకి మంత్రి పదవి ఇచ్చి గౌరవించారు. కష్టంలో ఆయన చంద్రబాబుతో పోటీ పడతారు. రోజుకు పద్దెనిమిది గంటలు విధులు నిర్వహిస్తారు. పదవి చేపట్టినప్పటి నుండి నెల్లూరు నగరంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నగరంలో 48వేల ఇళ్ల నిర్మాణం చేపట్టి, ఇరవై వేల ఇళ్లు లబ్ధిదారులకి అందించారు. సిటీ, రూరల్ నియోజకవర్గంలో రూ.5264కోట్లతో అభివృద్ది కార్యక్రమాలు నిర్వహించారు. ప్రస్తుతం వాటినే జనంలోకి తీసుకువెళుతూ ఎన్నికల ప్రచారం సాగిస్తున్నారు.
వైసీపీ ఎమ్మ్లెల్యే అనిల్ కుమార్ కి గత ఎన్నికల్లో సిటీ నుంచి ప్రజలు అవకాశం ఇచ్చారు. అయితే ఈ ఐదేళ్లలో ఆయన ప్రజలకి ఏం చేయలేకపోయారు. కనీసం అసెంబ్లీకి వెళ్లి ప్రజల సమస్యలపైనా చర్చించలేకపోయారు. ప్రజలు ఏ సమస్యపై ఆయన్ను కలిసినా జగనన్నా సీఎం అయితే… సమస్యలు తీరుస్తానని చెబుతూ ఉండేవారు. ప్రభుత్వంలో కలిసి పనిచేయలేకపోయారు. ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్లి… మరోసారి అవకాశం ఇవ్వమని కోరుతున్నారు. అనిల్ కుమార్ వ్యవహారశైలి… నెల్లూరు నగర ప్రజలకు పొసగని విధంగా ఉంది. శాసనసభ్యుడినని ఆయన ఎప్పుడూ తనను తాను గుర్తుంచుకోరు. ఓ చిన్న స్థాయి రౌడీలా వ్యవహరిస్తూ ఉంటారు. బెట్టింగ్ రాకెట్‌ను నడుపుతారని.. నెల్లూరులో అందరూ చెప్పుకుంటారు. అందుకే ఓ విద్యావేత్తకు.. మరో బెట్టింగ్ బంగార్రాజుకు మధ్య పోరు జరుగుతోందనన ప్రచారం జరుగుతోంది.
నెల్లూరు అర్బన్‌లో టీడీపీ ఎప్పుడూ అంత బలంగా లేదు. గత రెండు ఎన్నికల్లోనూ ఓడిపోయింది. ఓ సారి పీఆర్పీ గెలిచింది. గత ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అయినా.. అభివృద్ధి నినాదంతో… నారాయణ బరిలో నిలిచారు. కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువగా ఉండటం… ప్రజల్లో విద్యావేత్తగా పలుకుబడి ఉండటంతో… ఆయన ధీమాగా ఉన్నారు.