మెగా హీరో పవన్, ఆయన సోదరుడు నాగబాబు ఎన్నికల బరిలో వున్నారు. అయితే మెగా క్యాంప్ నుంచి మాత్రం ఎవ్వరూ ప్రచారానికి దిగలేదు. ఏం జరుగుతోంది? వాస్తవానికి మెగా క్యాంప్ మొత్తం తెరవెనుక ఏ విధంగా మద్దతు ఇవ్వాలో ఆ విధంగా అందిస్తున్నట్లు తెలుస్తోంది. నాగబాబు ప్రచారం ఖర్చు చాలా వరకు మెగా క్యాంప్ నుంచే వెళ్తున్నట్లు బోగట్టా.
ఇదిలా వుంటే ప్రచారం ముగిసేలోపు, ఓసారి నాగబాబుకు మద్దతుగా స్టయిలిష్ స్టార్ బన్నీ ప్రచార రంగంలోకి దిగే అవకాశం వుందని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు ఎవ్వరి మద్దతు అవసరం లేదు. నైతిక మద్దతు ఇస్తే చాలు అని మెగా క్యాంప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే నాగబాబుకు మాత్రం మద్దతుగా గ్రౌండ్ లోకి వెళ్లాలని బన్నీ ఆలోచిస్తున్నట్లు బోగట్టా.
పార్టీలతో సంబంధం లేకుండా, పార్టీలను విమర్శించకుండా, కేవలం తమ కుటుంబానికి చెందిన నాగబాబును గెలిపించమని బన్నీ అప్పీల్ చేసే అవకాశం వుందని తెలుస్తోంది. ప్రస్తుతానికి బన్నీకి అత్యంత సన్నిహితుడు బన్నీ వాస్ అన్నీ తానై జనసేన కార్యక్రమాలు చక్కబెడుతున్నారు. బన్నీ ప్రచారం మీద మాత్రం ఫైనల్ డెసిషన్ తీసుకోలేదు. ఫస్ట్ తరువాత ఓ నిర్ణయం తీసుకునే అవకాశం వుంది.
బన్నీ ప్రచారంలోకి దిగితే మాత్రం జస్ట్ ఒకటి రెండు రోజులు నాగబాబు నియోజకవర్గానికే పరిమితం అయి వుండే అవకాశం వుందని తెలుస్తోంది. ఇదిలా వుంటే హీరో వరుణ్ తేజ్ కూడా తండ్రికి మద్దతుగా రంగంలోకి వస్తారని తెలుస్తోంది