కులంలో ఒకరిద్దరికి.. అగ్ర తాంబూలం ఇచ్చి కులం మొత్తానికి మేలు చేసినట్లు చెప్పుకోవడం.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే నాయకుని లక్షణం. తన హయంలో ఇద్దరు, ముగ్గురు బ్రాహ్మణులకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చి .. వారిని రాజకీయంగా ప్రొత్సహించి.. బ్రాహ్మణ వర్గానికి మొత్తానికి ఏదో… లాభం చేసేశామని ప్రచారం చేసుకున్నారు. కానీ.. ఆయన సీఎంగా ఉన్న ఐదేళ్లలో… పేద బ్రాహ్మణుల కోసం.. కేటాయించిన మొత్తం.. అక్షరాలా సున్నా…! ఒక్క రూపాయి కూడా… పేద బ్రాహ్మణుల కోసం ఖర్చు చేయలేదు.
వైఎస్ ఒక్క రూపాయి ఇవ్వకున్నా బ్రాహ్మణ పక్షపాతి ఎలా అయ్యారు..?
వైఎస్ఆర్ హయాంలో… బ్రాహ్మణ సంక్షేమం కోసం…ఒక్క రూపాయి కాదు.. ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఆయన బ్రాహ్మణులను ఒక్క శాతం ఓటు బ్యాంక్‌గానే చూశారు. ఆ ఒక్క శాతం కోసం.. ఒకరిద్దరికి ఎమ్మెల్యే టిక్కెట్లు, వారికి… కాస్త ఆర్థిక ప్రయోజనాలు వ్యక్తిగతం గా కల్పిస్తే చాలనుకున్నారు. అదే చేశారు. వారు ఆయనకు… బ్రాహ్మణ పక్షపాతి అనే బిరుదు ఇచ్చేశారు. అలా లబ్దిపొందిన వాళ్లే.. ఆయనకు ఆ బిరుదును అలా కొనసాగిస్తున్నారు. ఇప్పుడు వారసత్వం దాన్నే ఆయన కుమారుడికి కూడా ఇచ్చేస్తున్నారు. ఆ ఇద్దరు, ముగ్గురేనా బ్రాహ్మణులు. చెప్పుకోవడానికి ఉన్నత కులం… కానీ… రోజువారీ జీవనం దుర్భంగా ఉండే.. పేద బ్రాహ్మణులు.. మనుషులు కారా..? అగ్రకులం పేరుతో.. వారిని ఆకలితో అలమటించేలా చేసినా… పట్టించుకోరా..?. ఉన్నతంగా ఎదిగిన వారిని చూసుకుని పేదలు సంతృప్తి పడాలా..?. అలా ఐదేళ్ల పాటు ఆకలితో అలమటించేలా చేసిన.. వైఎస్ఆర్ బ్రాహ్మణ పక్షపాతి ఎలా అయ్యారు..?
దేశంలో ఎక్కడైనా బ్రాహ్మణ కార్పొరేషన్ ఉందా..? ఏపీలో ఉంది..!
దేశంలో బ్రాహ్మణులు అంటే.. మొట్టమొదటి అగ్రవర్ణం. అది నిజమే . అంత మాత్రాన వారిలో పేదలు ఉండరా..? ఉత్తరాది రాష్ట్రాల్లో… బ్రాహ్మణులు అత్యంత దుర్భరమైన పరిస్థితుల్లో ఉంటారు. దక్షిణాదిలో కొంత బెటర్. కానీ..ఆర్థికంగా ఉన్నతంగా ఎదిగిన వాళ్లు తక్కువే. ఉత్తరాదిలో బ్రాహ్మణుల ఓట్లన్నీ ఏకపక్షంగా వేయించుకునే పార్టీలు.. ఏళ్ల తరబడి.. పాలన చేసినా.. వారి సంక్షేమం కోసం చేసింది శూన్యం. కానీ దేశంలో మొట్టమొదటిసారిగా బ్రాహ్మణుల్లోనూ పేదలుంటారని… వివిధ రకాల కారణాలతో ప్రభుత్వ పథకాలేమీ వారి వద్దరు చేరడం లేదని… తెలుసుకున్న చంద్రబాబు… కార్పొరేషన్ పెట్టారు. ఇప్పటి వరకూ. రూ. 270 కోట్లు కార్పొరేషన్‌కు ఇచ్చారు. ఈ నిధులతో.. పేద బ్రాహ్మణులకు అనేక పథకాలు అమలు చేస్తున్నారు.
మనుశర్మ : శబరిమల కన్నా ముందే తిరుమలపై కన్ను..! అలాంటి వాళ్లకు ఓటేయాలా…?
రెండు ఎమ్మెల్యే సీట్లు కాదు.. ! లక్షన్నర మంది పేదబ్రాహ్మణులకు సాయం..!
ఓటు బ్యాంక్ చూసుకుని ఇద్దరికి ఎమ్మెల్యే సీట్లు ఇస్తే సరిపోతుందా..? లక్షల మంది పేద బ్రాహ్మణ కుటుంబాలకు ఆర్థికంగా ఆసరా ఇస్తే మంచిదా..?. బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా ఇప్పటికి లక్షన్నర బ్రాహ్మణ కుటుంబాలు లబ్దిపొందాయి. విదేశాల్లో చదువుకు అవకాశాలు వచ్చి .. డబ్బుల్లేని 224 మంది పేద బ్రాహ్మణ విద్యార్థులకు రూ. 21 కోట్లు ఇచ్చి విదేశీ విద్య అందించింది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు పరీక్షలు రాసేందుకు శిక్షణ కోసం.. నాలుగు వేల మందికి రూ. 5 కోట్లు ఇచ్చింది. కశ్యప్ పథకం కింద.. అనాధ బ్రాహ్మణులు, వృద్ధులు, వితంతువులకు రూ. 36 కోట్లు వెచ్చించి సాయం చేస్తున్నారు. ఈ పథకం ద్వారా లబ్ది పొందిన వారు, పొందుతున్న వారు నలభై ఐదు వేల మందికిపైగానే ఉన్నారు. ద్రోణాచార్య, చాణక్య పథకాల కింద పేద బ్రాహ్మణ యువతకు సాయం చేస్తున్నారు. అలాగే.. చివరికి ఎవరైనా పేద కుటుంబంలో చనిపోతే… వారి దహనసంస్కారాలకు ఇబ్బంది లేకుండా.. వెంటనే రూ. పదివేలు ఇస్తోంది ప్రభుత్వం. ఇవన్నీ.. అచ్చంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో అందిన సాయమే. అందకు ముందున్న ప్రభుత్వాలేమీ కనీసం ఆలోచన కూడా చేయలేదు. బ్రాహ్మణులకు సాయం ఏంటి అన్నట్లుగా చూశారు. ఇద్దరికి ఎమ్మెల్యే సీట్లు సరిపోతాయా..? మిగతా ప్రజల సంక్షేమం అక్కర్లేదా..?
Click here for Part 1 : మనుశర్మ : నేను జంధ్యం కడతా..కోన..! కానీ జగన్‌కే ఎందుకు ఓటేయాలి..?
సాయం చేయరు.. ! చేసే వాళ్లను ఓడిద్దామా..?
అయితే దురదృష్టవశాత్తూ… అన్నం పెట్టిన వాళ్లను కాకుండా.. సున్నం కొట్టిన వాళ్లను .. ఆదరించమని..పిలుపునిచ్చే వారే ఎక్కువయ్యారు. దానికి పవిత్రమైన జంధ్యాన్ని కూడా వాడేసుకుంటున్నాు. జంధ్యం కట్టుకున్న ప్రతి ఒక్కరూ … జగన్‌కే ఓటు వేయాలని నిస్సిగ్గుగా పిలుపునిస్తున్నారు. అలాంటి వారికి.. నేరుగా లాభం చేకూరుతోంది. అందుకే కులం మొత్తాన్ని తెచ్చి మాట్లాడేస్తున్నారు. కానీ ఆ కులంలో ఉన్న పేదల గురించి వారు ఒక్క మాట ఎప్పుడూ మాట్లాడలేదు. కులానికి ఓట్లకు ముడి పెట్టకుండా… మంచి చేసే వారినే ఆదరిద్దాం..!
Click here for Part 2 : మనుశర్మ : తిరుమల రెండు కొండలే అన్న వారి వారసులకు పట్టమెలా కడతాము..?