సందుగొందుల్లో సభలు పెట్టి.. పాత మిద్దెలపైకి జనాల్ని సమీకరిస్తే.. జరిగే ప్రమాదాలతో.. ప్రాణాలు పోతున్నాయి. ప్రచారం ప్రారంభంలో అనంతపురంలో… ఇప్పుడు తూ.గో జిల్లా మండపేటలో.. అవే జరిగాయి. మండపేటలోఅయితే రెండు ప్రాణాలు కూడా పోయాయి. అనేక మంది తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. మండపేటలో… జగన్ అప్పుడే.. వ్యాన్ పైకి వచ్చారు. అందరికీ దండం పెడుతున్న సమయంలోనే ఆ గోడ కూలింది. కానీ.. నవ్వుతూ దండం పెడుతూనే ఉన్నారు కానీ… కనీసం స్పందించలేదు. అందర్నీ.. అక్కడ్నుంచి తీసుకెళ్తూండగానే.. ప్రసంగం ప్రారంభించారు. కనీసం బాధితుల గురించి ఆలోచించకుండా.. రాజకీయ ప్రసంగం చేసేశారు. తర్వాత స్థానికుల నుంచి నిరసన వ్యక్తం కావడంతో.. ఆస్పత్రికి పరామర్శించారు.
గోడ కూలిపోయింది. 20మందికి గాయాలయ్యాయ్. ఒక్కసారిగా క్షతగాత్రులు ఆర్తనాదాలు చేయడం మొదలుపెట్టారు. పక్కన ఉన్నవాళ్లు అయ్యో పాపం అంటూ.. వారిని రక్షించే ప్రయత్నం చేశారు. అయితే కష్టాలు తీరుస్తా అని ప్రతీ సభలో చెప్పుకునే జగన్ మాత్రం కళ్లముందు నెత్తురోడుతూ జనాలు కనిపిస్తున్నా.. తన ప్రసంగాన్ని అలానే కొనసాగించారు. ఆర్తనాదాలు పెడుతున్న బాధితులను ఆస్పత్రులకు తరలించేందుకు అక్కడే ఉన్నవారు పరుగులు పెట్టారు.. కానీ జగన్ మాత్రం తన ప్రసంగాన్ని అలానే కొనసాగించారు. జగన్ తీరుపై ఇప్పుడు అందరూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాసేపైనా సభను ఆపి ఏం జరిగిందో కనుక్కోవచ్చు కదా అని విరుచుకుపడుతున్నారు. ఇసుమంత కూడా స్పందించలేదని జగన్ తీరును దుయ్యబట్టారు.
క్షతగాత్రుల్ని మండపేట నుంచి కాకినాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయాలపాలైన వారిని టీడీపీ, జనసేన నేతలు పరామర్శించారు. మండపేట సభలో విషాదం.. దానిపై స్పందన అయినా లేకపోవడం తీవ్రంగా విమర్శల పాలవుతోంది. తన మీద వచ్చిన విమర్శలతో చివరకు జగన్ ఆస్పత్రికి వెళ్ళారు. బాధితులను ఆదుకుంటామంటూ హామీ ఇచ్చి అక్కడ నుంచి వెళ్ళిపోయారు. మృతుల కుటుంబాలకు… కనీస సాయం కూడా చేయలేదు.