వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పవన్ కల్యాణ్ ఇద్దరూ ఒకరిపై ఒకరు మాటల దాడి పెంచుకుంటూ పోతున్నారు. టీడీపీ పార్టనర్ అంటూ … జగన్ చేస్తున్న విమర్శలకు.. చిత్తూరు జిల్లాలో గట్టి కౌంటర్ ఇచ్చారు. టీడీపీకి మద్దతిస్తే నేరుగా మద్దతిస్తానే తప్ప, మీలా భయపడి దొడ్డి దారిలో మోడీ కాళ్లు పట్టుకోబోనని ఎద్దేవా చేసారు. 2014 లోనూ టీడీపీకి నేరుగానే తన మద్దతిచ్చానని తెలిపారు. మీలా భయపడి దొడ్డి దారిలో బీజేపీ, టీఆర్ఎస్ మద్దతు కోసం చూడలేదని జగన్‌ని విమర్శించారు, ఈ ఎన్నికల్లో బీఎస్పీ, వామపక్షాలతో కలిసి జనసేన పోటీ చేస్తోందని తెలిపారు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఏ పార్టీతోనైనా పొత్తు కావాలంటే బహిరంగానే ప్రకటిస్తాను కానీ జగన్‌లా మోదీ కాళ్లు పట్టుకోనని మండిపడ్డారు. వైసీపీని చూసి టీడీపీ భయపడుతోందని, వైసీపీకి సరైన పార్టీ జనసేనేనని స్పష్టం చేశారు.
కేసీఆర్ సైకిల్ చైన్ తెంపేశారని, సైకిల్ పాతబడిపోయిందని పవన్ ఎద్దేవా చేశారు. శాసనసభకే వెళ్లని ప్రతిపక్షనేత రాష్ట్రానికి అవసరమా? అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. అంతకు పాలకొల్లులో జరిగిన ఎన్నికల ప్రచారంలో.. జగన్మోహన్ రెడ్డి.. పవన్ కల్యాణ్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. వివేకా హత్యపై… పవన్ చేసిన వ్యాఖ్యలపై పవన్ స్పందించారు. చంద్రబాబు పార్టనర్.. ఒక యాక్టర్ అని చెప్పారు. కుటుంబంలో ఎవరైనా హత్యకు గురైతే పవన్ ఇలానే మాట్లాడుతారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు చేసిన ప్రతి అన్యాయంలో పవన్ ఉంటారని ఆరోపించారు. ఒకవేళ కలిసుండకపోతే చంద్రబాబు మోసాలపై పవన్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.
పవన్ కల్యాణ్ నేరుగానే.. జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. అందులో.. అసెంబ్లీకి వెళ్లకపోవడం, వివేకా హత్యను దాచి పెట్టడం లాంటి కీలక అంశాలున్నాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం.. పవన్ కల్యాణ్ ను కార్నర్ చేయడానికి … సాదాసీదా అంశాలను అందుకుంటున్నారు. టీడీపీపై.. పవన్ కల్యాణ్.. ఘాటుగానే దాడి చేస్తున్నారు. అయితే.. వైసీపీపై ఆయన చేస్తున్న వ్యాఖ్యలే హైలెట్ అవుతున్నాయి. కానీ టీడీపీపై పవన్ విమర్శలు చేయట్లేదని.. ప్రచారం జరిగేలా.. జగన్ వ్యవహరిస్తున్నారు. అదే సమయంలో… జనసేన నామినేషన్లలో టీడీపీ జెండాలంటూ.. విచిత్రమైనవాదన వినిపిస్తున్నారు. గాజువాకలో.. పవన్ తో పాటు.. టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాసరావు ఒకే రోజు నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా.. రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద రెండు గ్రూపులు ఎదురు పడ్డాయి. కొంత ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది కూడా. దీన్ని జగన్.. పవన్ నామినేషన్లలో టీడీపీ నేతలు పాల్దొన్నారంటూ.. చెప్పుకొస్తున్నారు.