ఆంధ్రప్రదేశ్‌లో అధికారం కోసం పోటీ పడుతున్న రెండు ప్రధాన పార్టీలు.. మేనిఫెస్టోలను ఇంకా ప్రకటించలేదు. కానీ అందులో ఏమేమి ఉంటాయో.. దాదాపుగా ప్రతీ రోజూ.. ఎన్నికల ప్రచారసభల్లో ప్రకటిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి… నవరత్నాలనే ప్రధానంగా చెబుతున్నారు. మేనిఫెస్టోలోనూ అవే పెట్టే అవకాశం ఉంది. టీడీపీ అధినేత కూడా.. ఎన్నికల ప్రచారసభల్లో ఒక్కొక్కటిగా.. తాయిలాలు ప్రకటిస్తున్నారు. 2 పండగలకు 2 సిలిండర్లు ఉచితంగా ఇస్తామనే హామీని కొత్తగా చంద్రబాబు ప్రకటించారు. వీలైతే పండగలన్నిటికీ ఉచిత సిలిండర్లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామన్నారు. ఇప్పటి వరకు ఎన్నికల ప్రచారసభల్లో సాగుకు 12 గంటల కరెంట్, నిరుద్యోగ భృతి రూ.3వేలు , 18 ఏళ్లకే నిరుద్యోగ భృతి, సీపీఎస్ రద్దుకు చర్యలు, ప్రతి ఉద్యోగికీ ఇంటి స్థలం 3నెలల్లో కేటాయింపు, పేదల ఇళ్ల రుణాల మాఫీ, పరిశ్రమల్లో 80 శాతం ఉద్యోగాలు స్థానికులకే అనే హామీలు ప్రకటించారు.
ఇక రైతులకు అన్నదాత సుఖీభవ, మహిళలకు పసుపు-కుంకుమ, నిరుద్యోగ భృతి, ఎన్టీఆర్ క్యాంటిన్లు వంటి పథకాలను మరింతగా విస్తరించేందుకు హామీలిచ్చారు. వర్గాల వారీగా… కూడా. హామీలు ప్రకటిస్తున్నారు. ముస్లిం మైనారిటీల కోసం ప్రత్యేకంగా ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు, పైసా వడ్డీ లేకుండా రుణాలు, నవ్యాంధ్రలో కడప, కర్నూలు, అమరావతిల్లో మూడు హజ్ హౌస్‌ల నిర్మాస్తామని ప్రకటించారు. ఇప్పటికే వీటికి నిధులు మంజూరు చేశారు. ఇలా… ప్రతీ రోజూ.. రెండు, మూడు ఎన్నికల హామీలను.. చంద్రబాబు ప్రకటిస్తూ పోతున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కొత్త హామీలేమీ ఇవ్వడం లేదు. నిజానికి ఆయన ప్రచారంలో.. చంద్రబాబును విమర్శించడానికే సమయం కేటాయిస్తున్నాయి. నవరత్నాలను.. వివరించి చెబుతున్నారు కానీ.. ప్రజల్లోకి వెళ్లడం లేదు.
అందుకే.. టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసే వరకూ ఆగాలని.. వైసీపీ నేతలు .. ఓ అంచనాకు వచ్చినట్లు చెబుతున్నారు. అయితే.. ఈ విషయాన్ని పసిగట్టిన టీడీపీ… అధికారికంగా విడుదల చేయకుండా.. ఒక్కొక్క హామీని ప్రకటిస్తూ వస్తోంది. నిబంధనల ప్రకారం… పోలింగ్‌కు ముందే… మేనిఫెస్టోను ఈసీకి అందజేయాల్సి ఉంది. ఇక ఎంత దాచుకున్నా.. రెండు మూడు రోజుల్లో.. మేనిఫెస్టోలు రిలీజ్ చేయక తప్పని పరిస్థితి ఏర్పడింది.