రామ్‌చరణ్ అనుకోకుండా గాయపడ్డారు. జిమ్‌లో కసరత్తు చేస్తున్న చరణ్‌కి సడన్‌గా భుజం నొప్పి చేసింది. గాయం తీవ్రతని దృష్టిలో ఉంచుకుని ఆర్.ఆర్.ఆర్ షూటింగ్‌కి చిత్రబృందం మూడు వారాల బ్రేక్ ఇచ్చింది. పూణెలో ప్రారంభం కానున్న షెడ్యూల్ చరణ్ గాయం వల్ల వాయిదా పడింది. చరణ్ కోలుకున్న తరవాతే.. ఈ షెడ్యూల్ ని మళ్లీ మొదలెడతారు. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది కూడా. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ యువ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పాత్ర కోసం చరణ్ మరింత ఫిట్‌గా తయారవ్వాలని భావించాడు. రాజమౌళి సలహా మేరకు జిమ్ లో కసరత్తులు కూడా చేస్తున్నాడు. అందులో భాగంగా శిక్షణ తీసుకుంటున్న సమయంలో చరణ్ భుజానికి స్వల్ప గాయాలయ్యాయి. దాంతో షూటింగ్‌కి బ్రేక్ ఇవ్వక తప్పలేదు.
మూడు వారాల పాటు షూటింగ్ వాయిదా పడడం అంటే మామూలు విషయం కాదు. దాదాపు నెల రోజుల షెడ్యూల్ ఆగిపోయినట్టే. 2020 జులై 30న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని రాజమౌళి ప్రకటించారు. దాని ప్రకారమే షెడ్యూల్స్‌ని వేగవంతంగా పూర్తి చేయాలని భావించారు. కానీ.. సడన్‌గా ఈ అనుకోని అవాంతరం వచ్చింది. ఈ గ్యాప్‌ని రాజమౌళి ఎలా భర్తీ చేస్తారో చూడాలి మరి. లేదంటే… అనుకున్న సమయానికి ఈ సినిమాని విడుదల చేయడం కష్టమే.