ఏపీలో ఇప్పుడు… ఆంధ్ర సెంటిమెంట్ ఉంది. మోదీ మోసం చేశారన్న కోపం ఉంది. ఏ విధంగా చూసినా… కేసీఆర్, మోదీతో సంబంధాలున్నాయంటే.. అది కచ్చితంగా మైనస్ అవుతుంది. పైగా.. మోదీ తో ఏ మాత్రం సంబంధాలు ఉన్నట్లు అనిపించినా.. వైసీపీకి కోర్ ఓటు బ్యాంక్ అయిన ముస్లింలు.. దూరమయ్యే ప్రమాదం ఉంది. అలాగే దళితులు కూడా.. బీజేపీ పట్ల తీవ్ర వ్యతిరేకతతో ఉంటారు. ఈ ఓటు బ్యాంక్ దూరమైనా పర్వాలేదన్నట్లుగా… మోదీపై జగన్ అభిమానం చూపుతున్నారు. ఎందుకు..? ఏపీ ప్రజలంటే… అంత చులకనా..? కులగజ్జితో ఓట్లు వేసేస్తారనే అహంభావమా..? ఎందుకు ఏపీ ప్రజల్ని రెచ్చగొడుతున్నారు..?
మోడీ, కేసీఆర్ కాళ్ల దగ్గర ఏపీ ఆత్మాభిమానం..!
ఎన్నికల తర్వాత నరేంద్రమోదీ వైపే ఉంటాననే సంకేతాన్ని.. జగన్మోహన్ రెడ్డి.. జాతీయ మీడియా ఇంటర్యూల్లో ఇస్తున్నారు. మోడీపై.. జగన్ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఎన్నికల తర్వాత ఆయనే ప్రధానమంత్రి అవుతారని జోస్యం చెబుతున్నారు. మోదీ ధృడచిత్తం ఉన్న నాయకుడని కితాబిచ్చారు. ఎన్నికల తర్వాత దక్షిణాది ప్రాంతీయ పార్టీల్లో వైసీపీ బీజేపీ వైపే ఉంటుందని జాతీయ చానళ్లు చాలా రోజుల నుంచి చెబుతున్నాయి. దీనిపై జగన్మోహన్ రెడ్డి నేరుగా క్లారిటీ ఇచ్చినట్లయింది. ఏపీకి కేసీఆర్ మద్దతు చాలా అవసరం అని కూడా కేసీఆర్ అదే ఇంటర్యూలో వివరించారు. ప్రత్యేకహోదాకు ఆయన మద్దతు చాలా ముఖ్యమన్నారు. ప్రత్యేక హోదా కోసం కేసీఆర్ మద్దతిస్తున్నారని, ఆ మద్దతు ఏపీకి అత్యవసరమన్న జగన్ చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకహోదా ఇస్తామన్న విషయంపై మాత్రం సానుకలంగా స్పందించడానికి జగన్ రెడీగా లేరు.
కులోన్మాదంతో ఓట్లేస్తారని జగన్ తీర్మానించేసుకున్నారా..?
కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకహోదా విషయాన్ని మేనిఫెస్టోలో పెట్టినా.. కేసీఆర్ మద్దతు ఎలా గొప్పదో.. మాత్రం జగన్ చెప్పలేకపోతున్నారు. దక్షిణాదిలో తాము సీట్లు సాధించకపోయినా రహస్య మిత్రులు సాధిస్తే చాలనుకున్న బీజేపీకి జగన్ ఈ విధంగా అభయం ఇచ్చారు. ఓ విధంగా.. ఇక్కడ కేసీఆర్కు.. ఢిల్లీలో మోడీకి.. జగన్ వంగిపోయాడన్న అభిప్రాయం.. టైమ్స్ నౌ ఇంటర్యూలో వ్యక్తం చేసిన అభిప్రాయాలతో స్పష్టమయింది. విభజన హామీల విషయంలో ఏపీని దారుణంగా మోసం చేసిన మోదీపై.. స్వరాష్ట్రంలో తీవ్రమైన వ్యతిరేకత ఉండగా.. జగన్ మాత్రం వెనకేసుకు రావడం కచ్చితంగా ఏపీ ప్రజల్ని అవమానించడమే.
తెలివిగల వాళ్లు అనే పేరుకే పరీక్ష పెట్టిన సందర్భం ఇది..!
బీజేపీ నేతలు… మోదీ సహా.. ఎవరు ఏపీకి వచ్చినా… చంద్రబాబును విమర్శించి వెళ్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఒక్క మాట కూడా అనడం లేదు. అలాగే..ఎన్నికల ప్రచారంలో జగన్మోహన్ రెడ్డి కూడా.. బీజేపీ కానీ.. విభజన హామీలను అమలు చేయని మోదీని కూడా విమర్శించడం లేదు. హైదరాబాద్ లో ఆస్తులు, కేసుల భయాలతోనే కేసీఆర్, మోదీకి జగన్ లొంగిపోయారు. ఆయన ఏపీకి సీఎం అయితే.. ఏపీ సామంత రాజ్యంగా మిగిలిపోతుంది. మొత్తానికే ఏపీ ప్రజలకు ఆత్మగౌరవం లేని వ్యక్తులుగా నిలబెట్టే ప్రయత్నం జరుగుతోంది. కులం పేరుతో ఏపీ అస్థిత్వాన్నే దెబ్బకొట్టే కుట్ర జరుగుతోంది. ఆంధ్రులు తెలివిగలవాళ్లని ప్రపంచం మొత్తం అనుకుంటారు. ఆ తెలివితేటలకే పరీక్, పెట్టిన సందర్భం ఇంది..! ఆంధ్రుడు మేలుకోవాల్సిన సమయం ఇది..! .