వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు క్షేత్ర స్థాయిలో ఎలా ప్రచారం చేస్తున్నారో కానీ… ఆన్లైన్లో మాత్రం ప్రచారాన్ని దున్ని పడేస్తున్నారు. సోషల్ మీడియాతో సహా… వెబ్సైట్లు మొత్తం.. జగన్ రావాలి.. జగన్ కావాలి అనే ప్రకటనలతో హోరెత్తిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఒక్క ఫేస్ బుక్ మాత్రం… ఎవరు ఎంత … యాడ్స్ కోసం.. వెచ్చిస్తున్నారనే అంశంపై.. నివేదికలు నెల వారీగా విడుదల చేస్తోంది. జగన్మోహన్ రెడ్డికి చెందిన.. వైసీపీ కి పొలిటికల్ స్ట్రాటజిస్ట్, ఆన్ లైన్ ప్రచార బాధ్యతలు చూస్తున్న ప్రశాంత్ కిషోర్‌కు చెందిన ఐ ప్యాక్ సంస్థ …ఒక్క ఫేస్ బుక్‌లో .. వైసీపీ ప్రకటనల కోసం.. ఒక్క నెలలో రూ. 42 లక్షల రూపాయలు వెచ్చించింది. ఇది ఒక్క ఫేస్ బుక్‌లో … వైసీపీ పేజీలను ప్రమోట్ చేయడానికి మాత్రమే.
ఇక వెబ్సైట్లు, యూట్యూబ్ సహా… ఇతర సామాజిక మాధ్యమాల్లో.. విస్త్రతంగా చేస్తున్న ప్రచారానికి కనీసం రూ. యాభై కోట్లను ఖర్చు చేసి ఉంటారన్న విశ్లేషణలు.. ఆన్ లైన్ మార్కెటింగ్ నిపుణుల నుంచి వస్తున్నాయి. ఇటీవల ఓ పాటను యూ ట్యూబ్‌లో…ఐ ప్యాక్ ప్రమోట్ చేసింది. ఆ పాటను.. వారం రోజుల పాటు… టాప్ ప్రయారిటీ యాడ్‌గా.. యూ ట్యూబ్‌లో ఉంటారు. అంటే.. నిర్దేశించిన ప్రాంతంలో ఎవరు యూ ట్యూబ్ ఓపెన్ చేసినా.. ముందుగా.. ఆ పాట కనిపిస్తుంది. అలా ఉంచడానికి పెద్ద ఎత్తున ఖర్చయి ఉంటుందని చెబుతున్నారు. ఆ పాటికి కోటి వ్యూస్ వచ్చాయని ప్రచారం చేసుకున్నారు కానీ.. దాన్ని ప్రమోట్ చేయడానికి అంత కంటే పది రెట్లు ఎక్కువగా ఖర్చు పెట్టారన్న విశ్లేషణలు ఉన్నాయి. ఇక వెబ్ సైట్లలో… అయితే.. దేనినీ వదిలి పెట్టలేదు. ఐపీఎల్ మ్యాచులు జరుగుతున్నాయి కాబట్టి… క్రికెట్ స్కోర్లు అందించే వెబ్ సైట్లకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. వాటిలోనూ యాడ్స్ ఉంచారు.
ప్రజల్లో ప్రచారం చేస్తున్నారో లేదో కానీ.. .ఆన్ లైన్ లో మాత్రం.. వైసీపీ ప్రచారం లో ముందు ఉంది. సోషల్ మీడియాలో.. ఆ పార్టీకి చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు.. ఇతర పార్టీలపై తిట్ల పురాణం వినిపిస్తూ ఉంటారు. ఐ ప్యాక్ మాత్రం… వైసీపీని… మోసేందుకు.. ఇలా ప్రమోట్ చేస్తూ ఉంటుంది. ఆన్ లైన్ ప్రచారం కోసమే.. కోట్లు వెచ్చిస్తున్న వైసీపీ.. మిగతా విషయాల్లో ఇంకెంత భారీగా ఖర్చు పెడుతుందోనన్న చర్చ.. అంతటా నడుస్తోంది.