లక్ష్మీపార్వతి..కోటి అనే యువకుడ్ని లైంగికంగా వేధిస్తున్నారట. ఆ యవకుడు వినుకొండకు చెందిన వ్యక్తి. కొన్నాళ్లుగా లక్ష్మీపార్వతి అనుచరునిగా వ్యవహరిస్తున్నారు. లక్ష్మీపార్వతి లైంగిక వేధింపులు.. పెరిగిపోయేసరికి తట్టుకోలేక..ఆ కోటి.. వినుకొండ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు వివరం బయటకు రావడంతో… దీని వెనుక ఉన్న గుట్టుముట్లన్నీ…తెలుగు న్యూస్ చానల్ బయటపెట్టింది. అయితే.. ఈ ఒక్క ఫిర్యాదు మాత్రమే కాదు.. లక్ష్మీపార్వతి చేసిన కొన్ని వాట్సాప్ చాటింగ్ స్క్రీన్ షాట్స్.. మరికొన్ని ఆడియో టేపుల్ని కూడా ఎయిర్ చేసింది. కోటి అనే యువకుడితో అసభ్యకరంగా చాటింగ్ చేయడమే కాకుండా.. ఐ లవ్ యూ అంటూ.. మెసేజ్ పెట్టినట్లుగా.. వాట్సాప్ చాటింగ్ లో ఉంది.
ఇక ఎయిర్ చేసిన ఆడియో టేపుల్లో.. ఎన్టీఆర్ పై ఏ మాత్రం గౌరవం లేకుండా.. లక్ష్మీపార్వతి మాట్లాడారు. చాలా దుర్మార్గాలు చేశారని.. చెప్పుకొచ్చారు. కొద్ది రోజుల క్రితం నాదెండ్ల భాస్కర్ రావు.. యూ ట్యూబ్ చానళ్లకు ఇచ్చిన ఇంటర్యూల్లో… ఎన్టీఆర్ పై అనేక ఆరోపణలు చేశారు. అవన్నీ నిజమేనన్నట్లుగా లక్ష్మీపార్వతి మాట్లాడటం.. ఆడియో టేపుల్లో ఉంది. ఆడియో టేపుల్లో… మోహన్ బాబు ప్రస్తావన కూడా ఉంది. ఆయన వైసీపీలో చేరిన తర్వాతనే ఆ ఆడియోను రికార్డు చేసినట్లుగా ఉన్నారు. ఆయన చంద్రబాబుపై కోపంతో.. వైసీపీలోకి వచ్చారని.. చెప్పుకున్నారు.
అయితే.. మోహన్ బాబును.. లక్ష్మీపార్వతి వేస్ట్ ఫెలోగా తీసి పడేసింది. లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే సినిమాను ఆర్జీవీ తీయడంలో.. లక్ష్మీపార్వతి వ్యవహారశైలిపై కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈ సమయంలో… తాజాగా.. టీవీ చానల్.. ఈ విషయాన్ని బయటపెట్టడం.. సంచలనాత్మకం అయింది. ఇప్పటి వరకూ.. లైంగిక వేధింపుల ఫిర్యాదులు ఎక్కువగా ఆడవాళ్లే ఇచ్చేవాళ్లు.. లక్ష్మీపార్వతి విషయంలో రివర్స్ అయింది. ఆమె లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు.. కోటి ఇచ్చారు.