ఎన్నికల ప్రచారం ఊపందుకునేకొద్దీ.. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రచార శైలి మారుస్తూ వచ్చారు. ఓటింగ్ దగ్గరకు వచ్చే సరికి… ఇప్పుడు…తనను చూసి ఓటేయమని పిలుపునిస్తున్నారు. దీనికి కారణం.. అధికారంలో ఉన్నప్పుడు.. పార్టీ నేతలు, ఎమ్మెల్యే అభ్యర్థులు వ్యవహరించిన తీరుతో.. కింది స్థాయిలో ఉండే అసంతృప్తి ఓట్ల రూపంలో వస్తుందేమోనన్న ఆందోళన చంద్రబాబులో రావడమేనంటున్నారు. ఎంత లేదన్నా.. అధికారంలో ఉన్న పార్టీకి.. ఎంతో కొంత వ్యతిరేకత ఉంటుంది. ఆ వ్యతిరేకత… అధికార పార్టీ నేతల పేరుతో… కింది స్థాయి నేతలు చేసే హడావుడి వల్లే ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం టీడీపీ అధినేతగా చంద్రబాబుకు తెలియనిది కాదు. కానీ.. ముందు నుంచి ఈ మాట చెబితే.. వ్యతిరేకత ఎక్కువ ఉందనే ప్రచారం జరిగే అవకాశం ఉంది.
అందుకే…ఓటింగ్ .. మూడు రోజులు ఉందనగా.. కింది స్థాయి నేతలు చేసిన పనుల వల్ల వ్యతిరేకతతో టీడీపీకి ఓటు వేయకుండా ఉండవద్దని..ఆయన ప్రజలకు సందేశం పంపదల్చుకున్నారు. అందుకోసమే… తనను చూసి ఓటేయండని పిలుపునిస్తున్నారు., రాష్ట్రంలో ఉన్న 25 పార్లమెంట్ నియోజకవర్గాలు, 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో తానే అభ్యర్థినని చెబుతున్నారు. చంద్రబాబు ఏ విషయంపైనైనా … టైమింగ్తో స్ట్రాటజిక్ గా వ్యవహరిస్తారు. ఇప్పుడు… అధికార పార్టీపై క్షేత్ర స్థాయిలో ఉండే అసంతృప్తిని కూడా… దూరం చేయడానికి.. వ్యూహాత్మకంగా.. తననే ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు.
మరి చంద్రబాబును… సామాజికవర్గం, ఇతర కోణాల్లో వ్యతిరేకించేవారూ చాలా మంది ఉంటారు. అలాంటి వారి కోసం కూడా.. చంద్రబాబు… ఓ ప్రత్యేకమైన వ్యూహం సిద్ధం చేసుకున్నారు. తాను శాశ్వతం కాదని.. రాష్ట్రం శాశ్వతమని.. గుర్తు చేస్తున్నారు. రాష్ట్రం కోసం ఆలోచంచి ఓటు వేయాలని పిలుపునిస్తున్నారు. ఈ అంశం ప్రజల్లో కూడా… ఆలోచన రేకెత్తించేలా ఉంది. మొత్తానికి తన నలభై ఏళ్ల అనుభవంతో చంద్రబాబు.. వ్యూహాత్మకంగా.. ప్రచారశైలిని..మార్చుకుంటూ.. ఎప్పటికప్పుడు ఫీడ్ బ్యాక్ తీసుకుంటూ ముందుకెళ్తున్నారు.