మెగా కుటుంబం నుంచి జన సేన వైపు మొదటి అడుగు వేశాడు రామ్ చరణ్. బాబాయ్ పవన్ కళ్యాణ్ ని కలుసుకుని తన మద్దతు ప్రకటించాడు. ఇప్పుడు అల్లు అర్జున్ వంతు వచ్చింది. చరణ్ బాటలోనే బన్నీ కూడా… జనసేన వైపు కదిలాడు. మంగళవారం పాలకొల్లు వెళ్లి అక్కడ పవన్ ని కలుసుకోబోతున్నాడు. తన మద్దతు జనసేన కే అని… ఈ సందర్భంగా ప్రకటించబోతున్నాడు. అటు నుంచి నరసాపురం వెళ్లి నాగబాబు ని కూడా కలిసి రానున్నాడు. ఇదంతా మెగా అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఘడియలే. కాకపోతే ప్రచార పర్వం ముగిశాక రంగం లోకి రావడం వల్ల ఉపయోగం ఉండదు. చరణ్, బన్నీ కలిసి ప్రచారం చేసి ఉంటే.. కనీసం భీమవరం వెళ్లి, పవన్ కోసం ఓట్లు అభ్యర్దించి ఉంటే.. ఆ కిక్ వేరేగా ఉండేది. పైగా భీమవరం లో పవన్ గట్టి పోటీ ఎదుర్కొంటున్నాడు. మెగా ప్రచారం పవన్ కి కాస్తో కూస్తో లబ్ది చేకూర్చి ఇచ్చేది. ఈ పరామర్శలు, ట్విట్టర్ లో ప్రకటనల వల్ల జనసేనకు, జనసేనాని లబ్ది తక్కువే అనేది రాజకీయ విశ్లేషకుల మాట.